Sharukh khan : ఓటిటి లో “డుంకి” ఏంటి ఈ సడన్ సప్రైజ్..

Dunki

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో “డుంకి” అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో సలార్ కి పోటీగా రిలీజ్ అయిన ఈ చిత్రం క్లాస్ కంటెంట్ తో రావడంతో కాస్త దెబ్బతిన్నా, ఆల్మోస్ట్ లాంగ్ రన్ లో బెటర్ వసూళ్ళనే రాబట్టింది. ఇక ఈ సినిమాలో తాప్సి హీరోయిన్ గా నటించగా, విక్కీ కౌశల్ కీ రోల్ లో నటించాడు. డిసెంబర్ 21న రిలీజ్ అయిన ఈ సినిమా 460 కోట్లకి పైగా వసూలు చేసింది. అయితే డుంకి సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న వారికి సడన్ సర్ప్రైజ్ వచ్చింది.

వాలెంటైన్స్ డే స్పెషల్ గా డుంకి సినిమా నిన్న ఉదయం నుంచే ఊహించని స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. అయితే ఇందులో కేవలం హిందీ భాషలో మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. కానీ డుంకి సినిమా ఓటిటి స్ట్రీమింగ్ హక్కులు జియో సినిమా వారు సొంతం చేసుకున్నారని మొదట టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు సడన్ గా సర్ప్రైజింగ్ గా నెట్ ఫ్లిక్స్ లోకి ఈ సినిమా వచ్చేయడం విశేషం. అయితే డుంకి హిందీ రైట్స్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకుని కూడా ఉండవచ్చు. దీన్ని బట్టి మిగతా భాషల్లో జియో సినిమా లో రావచ్చు. లేదా సమయం తీసుకుని నెట్ ఫ్లిక్స్ లోనే అన్ని వెర్షన్లు రావచ్చు.

- Advertisement -

ఇక షారుఖ్ లాస్ట్ ఇయర్ పఠాన్, జవాన్ తో వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్స్ కొట్టగా డుంకి తో ప్లాప్ అందుకునే అవకాశం ఉండగా, మంచి రెస్పాన్స్ తెచ్చుకుని పోటీలో లాంగ్ రన్ లో యావరేజ్ గా నిలిచింది. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటిటి లో చూడ్డానికి చాలా వెయిట్ చేస్తున్నారు.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos,and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు