Valentines Day : ప్రేమికుల రోజన కొత్త సినిమాల ఫస్ట్ లుక్స్ ..

Dear uma

టాలీవుడ్ లో ప్రతి పండక్కి ఏవో ఒక సినిమాల అనౌన్స్ మెంట్, లేదా ఆల్రెడీ మొదలైన సినిమాల ఫస్ట్ లుక్స్ గాని, టీజర్లు గాని రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఈ ఇయర్ లో వాలెంటైన్స్ డే కి కూడా చాలా సినిమాల ఫస్ట్ లుక్స్, అనౌన్స్ మెంట్స్ కూడా జరిగాయి. మామూలుగా ఇలాంటివి ఏ సంక్రాంతికో, ఉగాదికో చేస్తూ ఉంటారు. కానీ మేకర్స్ లవర్స్ డే రోజు ఇన్ని సినిమాల అనౌన్స్ మెంట్ ఈసారి జరగడం విశేషం. ఆ సినిమాలేవో ఒక్కసారి లెక్కేస్తే అరడజనుకి పైగానే వచ్చాయి.

1. “8 వసంతాలు” : మైత్రి మూవీ మేకర్స్ నిర్మిచబోయే ఈ సినిమాను మను దర్శకుడు ఫణింద్ర తెరకెక్కించబోతున్నాడు. లవ్ స్టోరీగా తెరకెక్కబోయే ఈ సినిమా ని ప్రేమికుల రోజున అనౌన్స్ చేయగా, కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసి అప్పుడే ఆసక్తిని పెంచేశారు.

- Advertisement -

2. రామం రాఘవం : కమెడియన్ ధనరాజ్ హీరోగా స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు సముద్రఖని ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా వాలెంటైన్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటుంది. తండ్రి కొడుకుల నేపథ్యంలో ఫీల్ గుడ్ మూవీ లా ఈ సినిమా తెరకెక్కుతుంది.

3. UI : కన్నడ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం UI. ఈ సినిమా నుండి చీప్ సాంగ్ ప్రోమోని లవర్స్ డే రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఉప్పి మార్క్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సమ్మర్ లో రిలీజ్ కానుంది.

4. ఉషా పరిణయం : ప్రముఖ దర్శకుడు విజయ భాస్కర్.కె చాలా కాలం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఉషా పరిణయం. తన కొడుకు శ్రీ కమల్ ని హీరోగా పరిచయం చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ చేసారు. తన్వి ఆకాంక్ష హీరోయిన్ గా నటిస్తుంది.

5. జై గణేష్ : మళయాళ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్న జై గణేష్ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ప్రేమికుల రోజున రిలీజ్ చేయగా, ఈ సినిమాలో హీరో హ్యాండీ క్యాప్డ్ గా నటిస్తున్నాడు. అగస్ట్ 11న సినిమా రిలీజ్ కానుంది.

6. బంగారు గుడ్డు: తెలుగు నటుడు సంపూర్ణేష్ బాబు, తమిళ నటుడు రోబో శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ద్విభాషా చిత్రం “బంగారు గుడ్డు”. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లవర్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేయగా, హీరో ఆర్య తమిళ్, తెలుగులో ఫస్ట్ లుక్ లాంచ్ చేసాడు.

7. భలే ఉన్నాడే : జె. శివసాయి వర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ చేయగా n.v కిరణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.

8.సోలో బాయ్ : బిగ్ బాస్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా సినిమా సోలో బాయ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ లవర్స్ డే రోజున రిలీజ్ చెయ్యడం జరిగింది.

9. పేట రాప్ : కొరియోగ్రాఫర్ నటుడు ప్రభుదేవా హీరోగా sj సీను దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా పేట రాప్. ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ చేయగా వేదిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

10. డియర్ ఉమ : సాయి రాజేష్ మహదేవ్ దర్శకుడిగా సౌమ్య రెడ్డి హీరోయిన్ గా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ అయింది. పృథ్వీ అంబార్ హీరోగా నటిస్తున్నాడు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు