Sundeep Kishan : ఇదే మంచి అవకాశం.. ఎంత వాడుకుంటే అంత మంచిది

Ooru peru bhairavakona

టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “ఊరు పేరు భైరవకోన”. ఈ సినిమా ఫిబ్రవరి 16న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. VI ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను “ఏకే ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించడం జరిగింది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథ శ్రీ కృష్ణదేవరాయల కాలానికి లింక్ చేసి ఒక ఫిక్షనల్ డ్రామాని తయారుచేసారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ద్వారా మంచి హైప్ పెంచుకున్న ఈ సినిమా థియేటర్ లో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయింది. ఇక తాజాగా ఊరు పేరు భైరవకోన స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోలు వేయగా, ప్రీమియర్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది.

అన్ని బాగుంటే ఇక సందీప్ కిషన్ కి ఈ సినిమాతో కం బ్యాక్ హిట్ వచ్చినట్టే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో వర్ష బొల్లమా, కావ్య థప్పర్ హీరోయిన్లు గా నటించగా, వెన్నెల కిషోర్, వైవా హర్ష, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఫిబ్రవరి 16న రిలీజ్ అవుతున్న ఊరు పేరు భైరవకోన సినిమాకు ఇతర సినిమాల నుండి పోటీ ఉంటుందని, థియేటర్ల సమస్య ఉంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమాకు పోటీగా రిలీజ్ అయ్యే కొన్ని సినిమాలు వాయిదా పడగా, రిలీజ్ అవుతున్న సినిమాలకు కూడా హైప్ లేదు. మమ్ముట్టి భ్రమయుగం ఈరోజే రిలీజ్ అవగా, తెలుగు రాష్ట్రాల్లో హైప్ లేకపోవడం వల్ల పట్టుమని వంద థియేటర్లలో కూడా రాలేదు. ఇక పొలిటికల్ డ్రామా రాజధాని ఫైల్స్ పై కూడా ఏమాత్రం అంచనాలు లేవు.

- Advertisement -

ఇక సందీప్ కిషన్ సినిమా కి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ వచ్చిన ఈగల్ అంతగా లేకపోవడంతో దీనిపై ఏమాత్రం ఎఫెక్ట్ పడదని చెప్పొచ్చు. అందువల్ల ఊరు పేరు భైరవకోన సినిమాకు థియేటర్లు కూడా భారీగా దక్కనున్నాయి. అందువల్ల సందీప్ కిషన్ సినిమాకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ కూడా దక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ప్రీమియర్ల ద్వారా కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోవడం వల్ల, మేకర్స్ ఇది గమనించి బాగా ప్రమోట్ చేసుకుంటే భారీ ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఇక వచ్చేవారం కూడా చిన్న సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి గనుక సందీప్ కిషన్ కి ఇది మంచి అడ్వాంటేజ్ అని చెప్పాలి. మరి ఈ బెనిఫిట్ ని మేకర్స్ ఎంత వరకూ వాడుకుంటారో చూడాలి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie re

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు