HBD Buchibabu : ఒక్క సినిమాతో ఇండస్ట్రీని తన వైపుకు తిప్పుకున్నాడు..

Buchibabu

టాలీవుడ్ లో ఒక్క సినిమాకే స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోలు, హీరోయిన్లను చూసాం. ఎవరికీ తెలియని వారు రాత్రికి రాత్రి దశ తిరిగి ఓవర్ నైట్ స్టార్ డమ్ లేదా మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే ఒక డైరెక్టర్ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ లో స్టార్ డైరెక్టర్ అయ్యి ఆ ఒక్క సినిమా అనుభవంతో పాన్ ఇండియా హీరోతో పాన్ ఇండియా మూవీ చేసే ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు “బుచ్చిబాబు సాన”. సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్ లో అప్పటికే మంచి పేరు ఉన్న బుచ్చిబాబు ఉప్పెన లాంటి అద్భుతమైన సినిమా తీస్తాడని ఎవరూ ఊహించలేదు.

ఫస్ట్ సినిమాకే మెగా కాంపౌండ్ లో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసిన ఈ దర్శకుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి మరింత మంచి మార్కులు కొట్టేసాడు. ఉప్పెన లాంటి సబ్జక్ట్స్ సాధారణంగా స్టార్ డైరెక్టర్లు , అనుభవం దర్శకులే హ్యాండిల్ చేస్తారు. అలాంటిది ఫస్ట్ సినిమాకే ఇంత క్లాసిక్ సినిమా తీసాడంటే తనలో ఎంత విషయముందో ఊహించొచ్చు. సుకుమార్ శిష్యుల్లో ఎంత మంది డైరెక్టర్లు అయినా బుచ్చిబాబుకి వచ్చినంత ఫేమ్ రాలేదు. పైగా ఉప్పెన కి మాటలు కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ” రాయి పాడైనంత మాత్రాన దేవుడు పాడవుతాడా”, శరీరంలో ఓ అవయవం పాడైనంత మాత్రాన ప్రేమ చెడిపోతుందా? అంటూ రాసిన ఒక్క డైలాగ్ చాలు బుచ్చిబాబు లో ఎంతటి రచయిత దాగున్నాడో..

- Advertisement -

అందుకే ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. అది కూడా పాన్ ఇండియా ని మించి పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మస్తున్న ఈ సినిమా మార్చిలో ప్రారంభమవుతుంది. ఒక విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమాతో బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ల సరసన నిలవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు(feb 15) బుచ్చిబాబు సాన పుట్టినరోజు. filmify టీమ్ తరపున బర్త్ డే విషెస్ తెలియచేస్తూ బుచ్చిబాబు తీస్తున్న RC16 మూవీతో అతనికి మరింత పేరు తెచ్చి పెట్టాలని విష్ చేస్తున్నాము.

For More Updates :Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు