Amala: అఖిల్ మంచోడు.. కానీ చైతూ.. అమల పక్షపాతం చూపించిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగార్జున భార్యగా అక్కినేని అమల ఎప్పుడూ తన కుటుంబం గురించి ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా నాగార్జున వ్యక్తిగత విషయాలను కూడా తెలుపుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమల మాట్లాడుతూ.. తన కుటుంబంలోని వ్యక్తులు ఎలా బిహేవ్ చేస్తారు అన్న విషయాలను తెలియజేసింది. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

నాగార్జున కి అమల రెండో భార్య అన్న సంగతి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన విషయమే.. ఆయన మొదటి భార్య లక్ష్మి ప్రముఖ నిర్మాత రామానాయుడు కూతురు.. నాగార్జున – లక్ష్మీ దంపతులకు నాగచైతన్య జన్మించారు.. ఆ తర్వాత కొద్ది కాలానికి వీరు విడిపోయినప్పటికీ నాగచైతన్య ఎక్కువగా నాగార్జున దగ్గరే పెరిగారు. అదే సమయంలో నాగార్జున తన సహనటి అయిన అమల తో ప్రేమలో పడి మరీ వివాహం చేసుకున్నారు. వీరికి అఖిల్ జన్మించారు. వివాహమైన తర్వాత అమల సినిమాలను పూర్తిగా తగ్గించేసింది. ఏదైనా మంచి పాత్ర కానీ బలమైన పాత్రలలో మాత్రమే నటిస్తోంది.

శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితంలో అమ్మ పాత్రలో మెప్పించింది అమల. అయితే చైతూ, అఖిల్ ఇద్దరిని కూడా సమానంగా చూసుకుంటుందనే వార్తలైతే వినిపిస్తూ ఉంటాయి. తాజాగా వారిద్దరి గురించి అమల మాట్లాడుతూ.. ఇద్దరి వ్యక్తిత్వాలను ఇద్దరి మధ్య బాండింగ్ గురించి తెలియజేసింది.. అమలా మాట్లాడుతూ.. నాగచైతన్యను నేను పెంచలేదు.. వాళ్ళ అమ్మనే పెంచింది.. చెన్నై నుంచి అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వచ్చే వారిని.. ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి అంటూ తెలిపింది. అఖిల్ కి ఒక మంచి బలమైన అన్నయ్యగా కూడా ఉన్నారని అమల తెలిపింది.

- Advertisement -

అయితే అఖిల్ , చైతన్య మధ్య మంచి లవ్లీ బాండింగ్ ఉంటుందని అసలు గొడవ పడరు అని.. చిన్న వయసులో తన అన్న చైతన్య ఎప్పుడు ఇంటికి వస్తాడా అంటూ అఖిల్ కూడా ఆత్రుతగా ఎదురు చూసేవారని ..చైతు వస్తే అతడి వెనకాలే తిరిగేవారని.. అలా చిన్న వయసులో ఇద్దరిని చూస్తే చాలా ముచ్చటగా అనిపించిందని అమల వెల్లడించింది.. చైతూ సైలెంట్ గానే ఉంటాడని.. తన తండ్రి తోనే ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ఇష్టపడే వారని తెలిపింది అమల.

ఇక అఖిల్ హైపర్ యాక్టివ్.. ఎన్నో యాక్టివిటీస్ లలో పాల్గొంటారు అంటూ తెలిపింది. అయితే వీరిద్దరి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటే తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుందని..కానీ జీవితం అనేది గొప్ప వరం.. వర్క్ ఫ్యాషన్ ఉంటే చాలు విజయాలు పరాజయాలు వస్తూ ఉంటాయి.. వాటన్నింటికీ నిరాశ పడకుండా ముందుకు వెళ్లడమే ఉత్తమం అంటూ తెలిపింది అమల.. ఇలా చైతూ, అఖిల్ ఇద్దరు కూడా సినిమా అయిపోగానే వాటి రిజల్ట్స్ నుంచి బయటికి వచ్చేసి మరో ప్రాజెక్టును చేస్తూ ఉంటారని తెలిపింది. మొత్తానికి అయితే కొడుకులిద్దర్నీ సమానంగా చూసుకుంటూ మంచి అమ్మగా పేరు తెచ్చుకుంది అమల.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు