Heroine: సినీ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరంటే..?

 

ఏ ఇండస్ట్రీలో నైనా సరే హీరోయిన్ల రెమ్యునరేషన్ కాస్త తక్కువగానే ఉంటుందని అనుకుంటారు.. అయితే ఓటీటీ ప్రాజెక్ట్ లకు స్టార్ హీరోయిన్లు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే చాలామంది అభిమానులు నోరెళ్ళబెడతారు .సినీ పరిశ్రమలో ఓటీటీ ఇప్పుడు చాలా కీలకంగా మారిపోయింది. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ ను కూడా ఎన్నో రకాల మలుపులు తిప్పుతున్నాయి.. దీంతో సినిమా ఆఫర్స్ కూడా భారీగానే పెరుగుతున్నాయి. అందుకే చాలామంది హీరోయిన్స్ థియేటర్ ప్రాజెక్టుల కంటే డిజిటల్ ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటి ద్వారా రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచేస్తున్నారు.

ఇలాంటి తరుణంలోనే ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన కరీనాకపూర్ ఒక్కో ప్రాజెక్టుకు రూ .10 నుంచి 12 కోట్ల రూపాయల వరకు తీసుకుంటోందట. కరీనా కపూర్ తర్వాత స్థానం హీరోయిన్ సమంతదే అన్నట్టు తెలుస్తోంది. డిజిటల్ ప్రాజెక్టుకు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.. త్వరలో రాబోయే సిటాడెల్ కోసం 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తోందని సమాచారం. అయితే ఈమె ఒక్కో సినిమాకు కేవలము రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు చర్జ్ చేస్తోంది.

- Advertisement -

సెన్సేషనల్ హీరోయిన్ రాధిక ఆప్టే ఒక్కో వెబ్ సిరీస్ కోసం రూ .4 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట.. మరొక బాలీవుడ్ నటి సుస్మితాసేన్ ప్రస్తుతం వరుసగా వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈమె కూడా ఒక్కో వెబ్ సిరీస్ కు రూ .2కోట్లకు పైగా తీసుకుంటోంది. టాలీవుడ్ , కోలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి ప్రియమణి కూడా ఈ మధ్య ఓటీటి లలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈమె ఒక్కో ఎపిసోడ్ కోసం రూ .10 లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన గోహార్ ఖాన్ ఒక్కో ఎపిసోడ్ కి 3 లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇండియాలో డిజిటల్ ప్లాట్ఫారంలో రెమ్యూనరేషన్ అత్యధికంగా అందుకుంటున్న వారిలో కరీనాకపూర్ మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో సమంతా ఉండడం గమనార్హం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు