Bhamakalapam -2: ట్రైలర్ తో ఆసక్తి పెంచేసిన ప్రియమణి..!

Bhamakalapam -2

కరోనా సమయంలో ఓటీటీలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి..2022 లో ప్రియమణి నటించిన భామాకలాపం అనే వెబ్ సిరీస్ డైరెక్ట్ గా ఆహా లో విడుదలై.. ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన అందుకుంది. ఇప్పుడు మేకర్ ఈ వెబ్ సిరీస్ కి కొనసాగింపుగా భామా కలాపం-2 వెబ్ సిరీస్ ను కూడా తీసుకువస్తున్నారు.. దాదాపుగా రెండేళ్ళ తర్వాత ఈ సీక్వెల్ మరొకసారి ఓటీటీ లోకి రాబోతోంది.

తాజాగా భామాకలాపం-2 ట్రైలర్ ని కూడా మేకర్స్ ఇటీవలే విడుదల చేశారు.. మొదటి భాగాన్ని మించి ఇందులో థ్రిల్లింగ్ ఎలివేషన్ తో పాటు కాస్త గ్లామర్ డోస్ కూడా అద్దినట్టుగా కనిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ నుంచీ మూవీ ట్రైలర్ ని తాజా గా ఆహా విడుదల చేసింది. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ పై కూడా భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి.

ట్రైలర్ విషయానికి వస్తే.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన హౌస్ వైఫ్ గా ఉన్న అనుపమ (ప్రియమణి) తానే సొంతంగా ఒక హోటల్ పెట్టాలనుకుంటుంది.. అలాంటి ఆమెకు ఒక మాఫియా వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి.. వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది? అనే విధంగానే భామాకలాపం-2 సీక్వెల్లో చూపించినట్లుగా ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది.. అయితే ఈ సీక్వెల్ మొత్తం కూడా బంగారు కోడిపుంజు చుట్టూ తిరుగుతున్నట్లుగా అర్థమవుతుంది.

- Advertisement -

ఇందులో ప్రియమణి మరొకసారి యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బుతోనే హోటల్ పెట్టాలనుకుంటున్నట్టు తన భర్తకు చెబుతున్న సన్నివేశాలతో ట్రైలర్ మొదలవుతుంది.. అలా ఆమె ఒక కుకింగ్ ఐడల్ షోలో పాల్గొన్నట్లుగా కనిపిస్తోంది.. అందుకు సెలెక్ట్ అవ్వడంతో సంతోషంతో ఈ విషయాన్ని తన భర్తకు కూడా చెబుతుంది అనుపమ (ప్రియమణి) .. ఈ కుకింగ్ ఐడల్లో గెలిచిన వారికి బంగారు కోడిపుంజు బహుమతిగా ఉంటుంది.. కానీ ఈ బంగారు కోడిపుంజుని కొంతమంది దొంగలించేందుకు ఒక మాఫియా ప్లాన్ చేస్తుంది.. ఈ నేపథ్యంలోనే ఆ మాఫియా వల్ల అనుపమ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది అనే విషయంపై ట్రైలర్లో చాలా ఆసక్తిని పెంచేశారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు