Amala: అక్కినేని ఫ్యామిలీలో కొత్త లవ్ స్టోరీ.. నాటీ నాగార్జున అంటూ..!

తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని ఫ్యామిలీది సుదీర్ఘమైన ప్రస్థానం. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఆయన తనయుడు నాగార్జున హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నాలుగు దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతున్నారు. ఇక ఆయన కుమారులు సైతం ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక అక్కినేని కుటుంబంలో ప్రేమ పెళ్లిళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగార్జున సినిమాల్లోకి రావడానికంటే ముందే దివంగత సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నారు.

ఆ తర్వాత 1986వ సంవత్సరంలో విక్రమ్ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యారు. ఈ దంపతులకు 1986లో అక్కినేని నాగచైతన్య జన్మించారు. కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 6 సంవత్సరాలకు 1990 లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత తనతోపాటు శివ, నిర్ణయం సినిమాలలో హీరోయిన్ గా నటించిన ప్రముఖ హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ కుటుంబంలో దాదాపు మరో పాతికేళ్ల తర్వాత మొదలైన రెండో లవ్ స్టోరీ నాగచైతన్య – సమంతలది. ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా సినీ పరిశ్రమకు పరిచయమైన సమంత ఈ సినిమాతో చైతుని నిజంగానే మాయ చేసింది.

ఇలా మొదలైన వీళ్ళ ప్రేమ ప్రయాణం మరో అడుగు ముందుకు పడి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్లకే వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇక నాగార్జున కుటుంబంలో మూడవ లవ్ స్టోరీ చిన్న కొడుకు అఖిల్ ది. ప్రముఖ వ్యాపారవేత్త, జీవీకే గ్రూప్ అధినేత గునుపాఠి వెంకటకృష్ణారెడ్డి మనవరాలు అయిన శ్రియ భూపాల్ లో ప్రేమలో పడిన అఖిల్ ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని ఆ తర్వాత పలు కారణాలతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.

- Advertisement -

అయితే తాజాగా అక్కినేని ఫ్యామిలీలో మరో కొత్త లవ్ స్టోరీ స్టార్ట్ అయింది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఆ జంట మరేదో కాదు నాగార్జున – అమల. ఎస్ ప్రజెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీలో లీకై తెగ ట్రెండ్ అవుతుంది. ఈ వయసులో నాగార్జున – అమల మళ్లీ హనీమూన్ కి వెళ్ళబోతున్నారట. ఇంట్లో పెళ్లి కావలసిన ఇద్దరు కొడుకులను పెట్టుకుని ఈ జంట జాలీగా ఎంజాయ్ చేయడానికి లాంగ్ ఫారిన్ ట్రిప్ వేస్తుందట. అంతేకాదు ఎవరు ఏమనుకున్నా పరవాలేదు.. మా లైఫ్ మాది అంటూ భారీ కొటేషన్స్ కూడా చెబుతున్నారట. ఇక అమల సైతం నాగార్జున చెప్పిన దానికి సై అంటూ ముందుకు దూసుకు వెళ్ళిపోతుందట. దీంతో అక్కినేని కాంపౌండ్ లో మరో కొత్త లవ్ స్టోరీ మొదలైందని.. నాటీ నాగార్జున అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు