Tollywood: RGV ని ఫాలో అవుతున్న అనసూయ భరద్వాజ్ ?

యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు నటిగా కూడా దూసుకెళ్తోంది. బ్యూటిఫుల్ అండ్ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ దశాబ్దకాలం పాటు టెలివిజన్ ను ఏలింది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అనసూయ చేసే కామెడీ అయినా ఆమె అందాలు అన్న అందరికీ ఇష్టమే.

అందుకే ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆమె ఇంకా నటిగా కొనసాగుతోంది. రోజురోజుకూ తన గ్లామర్ ను పెంచుకుంటూ కుర్ర కారు గుండెల్ని హీట్ ఎక్కిస్తోంది. ఇక తాజాగా సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య వేషధారణతో కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది అనసూయ. దీనికి ప్రశంసలు వచ్చినప్పటికీ మరికొందరు మాత్రం నెగటివ్ కామెంట్స్ పెట్టారు.

వాటిని తిప్పి కొట్టే క్రమంలో ‘ఎక్స్పోజ్ చేసినంత తేలిక కాదు సావిత్రిలా నటించడం అంటే. అలాగే ఎక్స్పోజింగ్ చేయడం కూడా తేలిక కాదు. శారీరకంగా, మానసికంగా చాలా ప్రిపేర్ అవ్వాలి’ అంటూ విమర్శకులకు ఒక కౌంటర్ ఇచ్చింది. దీంతో ‘కావాలనే అనసూయ ఇలాంటి వీడియోలు పెడుతోంది. ఆమెకు కాంట్రవర్సీ కావాలి. ఆర్జీవి కూడా ఇలాగే వివాదాన్ని సృష్టించి పబ్లిసిటీ చేసుకుంటాడు. నువ్వు కూడా ఆయన్ని ఫాలో అవుతున్నావు’ అంటూ మరోసారి రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు