Anasuya Bharadwaj: అనసూయ రాజకీయాల్లోకి రాబోతోందా.. ?

ఎప్పుడు ఏదో న్యూస్ తో నిత్యం వార్తల్లో ఉండే యాంకర్ అనసూయ మరోసారి లేటెస్ట్ గా రజాకార్ అనే మూవీ ప్రెస్ మీట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలతో నెట్టింట్ట వైరల్ అవుతుంది. తెలంగాణ లో నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన రజాకార్ల ఆగడాలను ప్రతిబింబిస్తూ రజాకార్ పేరుతో ఒక సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాలోని మొదటి పాటను కాసేపటి క్రితమే మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ పాట రిలీజ్ ఈవెంట్ లో అనసూయ తన పొలిటికల్ ఎంట్రీ గురించి ఒక హాట్ కామెంట్ చేయగా అది నెట్ లో ప్రస్తుతం వైరల్ గా మారింది.

జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెర పై సందడి చేసిన అనసూయ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత నుంచి వరుస మూవీ ఆఫర్స్ తో ఈరోజు వరకు కూడా బిజీ గా ఆర్టిస్ట్ గా సినీ జీవితాన్ని కొనసాగిస్తున్న అనసూయ లేటెస్ట్ గా రజాకార్ సినిమాలో నటించింది.

అయితే ఈ రజాకార్ సినిమా కాస్తో కూస్తో పోటికల్ టచ్ ఉన్న సబ్జెక్ట్ అవడంతో ఈ సినిమా మొదటి సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్ లో ఆమెను మీడియా విలేకరి మీరు రాజకీయం నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నారు ఫ్యూచర్ లో ఏమైనా రాజకీయాల్లోకి అడుగు పెట్టె అవకాశం ఉందా అని ప్రశ్నించారు. ఇక ఆ ప్రశ్నకు సమాధానంగా అనసూయ రాజకీయాలకు వచ్చే ఉద్దేశ్యం తనకేమాత్రం లేదని క్లారిటీ ఇచ్చింది. అలాగే నలుగురికి సాయం చేయడానికి రాజకీయాల ద్వారానే చేయాలనే రూల్ ఏం లేదని స్పష్టం చేసింది. తనకు ఉన్నంతలో తాను కూడా పలువురికి సాయం చేస్తున్నని చెప్పుకొచ్చింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు