MEGA157: వైజయంతి మూవీస్ లీగల్ నోటీసులు.. ఇది దేనికి సంకేతం

వైజంతి మూవీస్ నిర్మాణ సంస్థ కాసేపటి క్రితమే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సంబంధించి లీగల్ నోటీసులను జారీ చేసింది. ఇది వరకే కల్కి సినిమాకు సంబంధించి ఇదే విధంగా లీగల్ నోటిస్ ను జారీ చేసి.. అందరిని ఆశ్చర్య పరిచిన వైజయంతి మూవీస్ మరోసారి అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా పై లీగల్ నోటీసులు ఇష్యూ చేయడంతో మరోసారి వార్తల్లో నిలుస్తుంది.

అయితే ఈ నోటిసు సారాంశం ఏంటంటే.. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను మేధో సంపత్తి కి సంబంధించిన ప్రాపర్టీగా పరిగణిస్తూ.. ఈ సినిమా రీమేక్ గాని సీక్వెల్, ప్రీక్వెల్ గాని చేయడానికి వీల్లేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి కి సంబందించిన సర్వ హక్కులు.. వైజయంతి మూవీస్ చెంతనే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాకు సంబందించిన కథను, కాసెప్ట్ ను ఎవరైనా నకలు చేస్తే వారిపై చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటామని వైజయంతి మూవీస్ నోటిస్ లో వెల్లడించింది.

అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఇప్పుడు తెరపైకి రావడానికి కారణం మెగా స్టార్ చిరంజీవి లేటెస్ట్ గా బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వెల్ గా ఉండబోతుందటు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ వశిష్ఠ కూడా ఇదివరకు ఇంటర్వ్యూలలో ఇదే విషయాన్నీ వెల్లడించారు దాంతో వైజయంతీ మూవీస్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వెల్ గా ఎట్టి పరిస్థితులో వేరే ప్రొడక్షన్ నుంచి సినిమా రాకూడదనే ఉద్దేశ్యంతో వైజయంతి మూవీస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు