Mega157: చిరంజీవి సినిమాకు హీరోయిన్ కష్టాలు..?

Mega157:

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు తన కెరీర్ లో 156 సినిమాలలో ఎంతో మంది హీరోయిన్లతో ఆడి పాడారు. నాలుగు దశాబ్దాల ఆయన సినీ ప్రస్థానంలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎంతోమంది ఉంటారు. అయితే చిరుతో కలిసి నటించాలని ఎంతోమంది హీరోయిన్లు కలలు కంటూ ఉంటారు అనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం చిరంజీవి సీనియర్ హీరో కావడంతో చిరూ పక్కన నటించే హీరోయిన్ల విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చినప్పటినుండి ఆయన పక్కన హీరోయిన్లను సెట్ చేయడం దర్శకులకు పెద్ద టాస్క్ గా మారిందట.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చిరంజీవి బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భోళాశంకర్ తర్వాత చిరంజీవి నటిస్తున్న చిత్రం ఇది. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో మొదలుకానిందని సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక పనులలో బిజీగా ఉంది చిత్ర బృందం.

ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ ని ఎంపిక చేయడం దర్శకుడు వశిష్ఠకి పెద్ద టాస్క్ గా మారిందట. అయితే ఎట్టకేలకు వశిష్ట చాలా కష్టాలు పడి సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ ని ఈ చిత్రానికి ఒప్పించినట్లు తెలుస్తోంది. శ్రియ గతంలో చిరంజీవికి జోడిగా ఠాగూర్ సినిమాలో నటించింది. దీంతో వీరిద్దరిది హిట్ కాంబినేషన్ అనే పేరు ఉంది. కానీ ప్రస్తుతం శ్రీయ కు పెళ్లి కావడంతో పాటు ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. మరోవైపు ఇటీవల కాలంలో శ్రీయ నటించిన పలు సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఆమె వయసు ఇప్పటికే 40 సంవత్సరాలు దాటేసింది. శ్రియ ఆంటీ అయిపోయింది. మరి చిరంజీవి పక్కన ఈ శ్రియ ఆంటీని హీరోయిన్ గా సెట్ చేస్తే ఈ జోడి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందనేది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు