Tiger Nageshwararao: ఎక్కడ చూసినా రవన్నే.. అస్సలు వదలట్లేదుగా?

Tiger Nageshwararao:

టాలీవుడ్ లో ఈ దసరా కి రిలీజ్ అవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో “టైగర్ నాగేశ్వర రావు” కూడా ఒకటి. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కిందన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా అన్ని భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమా రిలీజ్ అవుతున్నందువల్ల మేకర్స్ సినిమా ప్రమోషన్స్ పై భారీగా ఫోకస్ పెట్టారు.

ఇక టైగర్ నాగేశ్వర రావు ట్రైలర్ ని డైరెక్ట్ గా సోషల్ మీడియా లో రిలీజ్ చేయకుండా, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ముంబై లో ఘనంగా లాంచ్ చేసారు. ఇక కొన్ని రోజులనుండి వరుస ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న మాస్ మహారాజ రవితేజ ఎక్కడ చూసినా తనే కనబడుతున్నాడు. ట్రైలర్ లాంచ్ చేసి వారం కూడా కాకముందే ఈరోజు పొద్దున్నే ముంబై చేరుకొని ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు రవితేజ.

ఇక తాజాగా ఇదే రోజు తెలుగు బిగ్ బాస్ షోకి కూడా తన సినిమా ప్రమోషన్లకి వచ్చాడు. ఈ షూట్ జరిగి ఆల్రెడీ ఒక్కరోజైనా ఈరోజే టీవీలో టెలికాస్ట్ కానుంది. ఇక తాజాగా రవితేజ వరల్డ్ కప్ మ్యాచ్ చూడ్డానికి వెళ్ళాడు. ఈరోజు ఇండియా ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్ అవుతుండడంతో అక్కడ కూడా తెలుగు యాంకర్ల తో మూవీ ప్రమోషన్లకి వెళ్ళిపోయాడు. చూస్తూ ఉంటే టైగర్ నాగేశ్వర రావు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎక్కడ చూసినా తన ప్రమోషన్లతో ఆడియన్స్ ని వదిలేలా లేడు. మరి టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు