Operation Valentine: రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న వరుణ్ తేజ్ సినిమా!

Operation Valentine:

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వరుణ్ తేజ్ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరోయే అయినా కమర్షియల్ సినిమాల జోలికి పెద్దగా పోకుండా, ప్రయోగాలు చేస్తూ, కంచె, అంతరిక్షం లాంటి సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపును పొందాడు. అయితే గత కొంత కాలంగా మాత్రం సెలక్షన్ బాగా లేకో, కాలం కలిసి రాకో సరైన హిట్ దక్కడం లేదు.

అందుకే ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో మరింత పగడ్బందీగా ఉండి సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే “ఆపరేషన్ వాలంటైన్” అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారత ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటినుండే ఆడియన్స్ లో మంచి క్రేజీ బజ్ మొదలైంది.

ఇక రీసెంట్ గానే ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా కంప్లీట్ అవగా, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ వల్ల షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చారు. ఇక లేటెస్ట్ గా “ఆపరేషన్ వాలంటైన్” సినిమా యొక్క రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు మూవీ మేకర్స్. ఈ రోజు ఒక వార్ పోస్టర్ ద్వారా “ఆపరేషన్ వాలంటైన్” సినిమాని 2023 డిసెంబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే రిలీజ్ కి మరో రెండు నెలలు మాత్రమే టైం ఉందన్నమాట. మరి ఈ సినిమాతోనైనా వరుణ్ తేజ్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు