Surender Reddy : సురేందర్ రెడ్డి సినిమాకు దారేది..

ఏజెంట్ సినిమా ఫ్లాప్ తో డైరెక్టర్ సురేందర్ రెడ్డి గతి అదో గతి అయింది. ఒకప్పుడు స్టార్ హీరోలందరు సురేందర్ రెడ్డి తో ఎప్పుడెప్పుడు సినిమా చేస్తామా అని ఎదురు చూసే పరిస్థితి నుంచి ప్రస్తుతం ఏ హీరో తనతో సినిమా చేయమని కనికరిస్తాడా అని డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దీనంతటికి కారణం సురేందర్ రెడ్డి వైఖరినే అని తెలుస్తుంది.

చిరంజీవి తో సైరా నరసింహ రెడ్డి, అఖిల్ తో ఏజెంట్ సినిమా తీసి భారీ డిజాస్టర్ లను అందించటంతో సురేందర్ రెడ్డి ని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా దూరం పెడుతున్నారు. అయితే సురేందర్ రెడ్డి మాత్రం చేస్తే మళ్ళీ భారీ బడ్జెట్ సినిమానే చేయాలనే ఉద్దేశ్యంతో భీష్మించుకుని కూర్చున్నాడు. నిన్నటి మొన్నటి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ప్రయత్నించినా సురేందర్ రెడ్డి ప్రస్తుతం ఆ ప్రయత్నం మానుకున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో మారిన ఏపీ పొలిటికల్ వ్యవహారాలు దృష్ట్యా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు కమిట్ అయ్యే పరిస్థితి లేదు. దాంతో సురేందర్ రెడ్డి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయాలనీ ప్రయత్నాలు చేస్తునట్టు సమాచారం అందుతోంది.

ప్రస్తుతం శైలేష్ కోలాను దర్శకత్వంలో ‘సైంధవ్ సినిమాలో నటిస్తున్న వెంకటేష్ ఈ సినిమా రిలీజ్ తరువాత సురేందర్ రెడ్డి తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. అయితే గతంలో కూడా సురేందర్ రెడ్డి వైష్ణవ్ తేజ్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో టాక్ అని వినిపించింది. ఇక లేటెస్ట్ గా వెంకటేష్ పేరు వినిపిస్తోంది. మరి ఈ రకమైన నిలకడలేని మనస్తత్వంతో సురేందర్ రెడ్డి ఏనాటికి తన నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కిస్తాడో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు