Anasuya Role In Peddha Kapu: అసంతృప్తి… అత్తమ్మ రేంజ్‌లో ఊహించుకున్న అక్కమ్మ

Anasuya Role In Peddha Kapu

ఏ సినిమా ఎప్పుడు ఎలాంటి విజయం సాధిస్తుందో ఎవరు ఊహించలేరు. కొన్ని కథలు, కొన్ని పాత్రలు పేపర్ మీద ఉన్నంత అద్భుతంగా , వెండితెరపై ఉండవు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా వినిపించిన సినిమా పేరు పెదకాపు. విరాట్ కర్ణ ను హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పెదకాపు మూవీ రిలీజ్ కంటే ముందునుంచే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన అనసూయ పాత్ర పై ఇంకా మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం.. ప్రతి మనిషి జీవితంలో ఒక సూపర్ హిట్ సినిమా అని ఒకటి ఉంటుంది. అలా అనసూయ విషయం కొస్తే “రంగస్థలం” సినిమాకు ముందు “రంగస్థలం” సినిమా తర్వాత అని చెప్పొచ్చు.

ఒక సినిమా చూసిన తర్వాత అతి తక్కువ సార్లు మాత్రమే ఆయా పాత్రలు మనకు గుర్తుంటాయి. అలా రంగస్థలం తర్వాత గుర్తుండిపోయే పాత్ర అంటే రంగమ్మత్త అని చెప్పుకుంటారు. రంగమ్మత్త స్థాయిలోనే పెదకాపు సినిమాలో “అక్కమ్మ” పాత్ర ఉంటుందని, అనసూయ తో పాటు ఆ మూవీ టీం కూడా చెప్పడం మనం కొన్ని ఇంటర్వ్యూస్ లో ప్రమోషనల్ వీడియోస్ లో గమనించవచ్చు.

- Advertisement -

ఇకపోతే నేడు పెదకాపు సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. నిజంగానే కొన్ని వీడియోల్లో చెప్పినట్లే సినిమాలో మంచి ఇంపార్టెంట్ రోల్. వాస్తవానికి కథలో కీలకమైన రోల్ అనసూయదే. కానీ ఈ రోల్ విషయంలో అనసూయ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం శ్రీకాంత్ అడ్డాల ఆమెకు కథను నేరేట్ చేసే విధానం. ఆ పాత్రకి ఉన్న ప్రాముఖ్యత, ఆ పాత్ర యొక్క వేల్యూ, ఆ పాత్రకు ఉన్న పవర్ ను ఒక రేంజ్ లో నేరేట్ చేసాడు అంట శ్రీకాంత్ అడ్డాల.

కానీ ఎగ్జిక్యూషన్ కి వచ్చేసరికి చెప్పిన స్థాయిలో లేదని అనసూయ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి అనసూయది కీలక పాత్రే అయినా, అంతా వెనుక ఉండి నడిపించడం వలన తన స్క్రీన్ ప్రెజన్స్ తక్కువగా ఉంటుంది. అలానే ఆ పాత్రకి అంత ఇంపార్టెన్స్ ఉండడానికి గల కారణాన్ని శ్రీకాంత్ చూపించిన విధానం కూడా ఒక రకంగా అనసూయను నిరాశపరిచి ఉండొచ్చు. ఏదేమైనా రంగమ్మత్త రేంజ్ లో ఊహించుకున్న అక్కమ్మ నిరాశలో ఉన్నట్లు సమాచారం.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు