Chandramukhi2 Movie: రజినీకాంత్‌కు అంతా తెలిసే తప్పుకున్నాడా?

Chandramukhi2 Movie

చంద్రముఖి రజినీకాంత్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. రజినీకాంత్‌లో కొత్త కోణాన్ని చూపడమే కాదు, హర్రర్ కాన్సెప్ట్ సినిమాలకు ఒక దిక్సూచిగా మారింది. చంద్రముఖి తర్వాత హర్రర్ జానర్‌లో చాలా సినిమాలు వచ్చాయి. వాటి అన్నింటికీ చంద్రముఖినే మూలం అని చెప్పొచ్చు. అలాంటి మూవీకి సీక్వెల్ వస్తుంది అంటే రజినీకాంత్ ఎందుకు వదులుకుంటాడు? కానీ వదులుకున్నాడు. మరి ఎందుకు వదులుకున్నాడు?

ఈ ప్రశ్న చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనికి సమాధాన్ని డైరెక్టర్ పి. వాసు ప్రమోషన్స్ సమయంలోనే చెప్పే ప్రయత్నం చేశాడు. చంద్రముఖి2 స్టోరీని ముందుగా రజినీకాంత్ వద్దకే తీసుకెళ్లానని, కథ విన్న తర్వాత, వేంకయ్య రాజు పాత్ర తనకు కంటే, రాఘవ లారెన్స్ కి బాగా సెట్ అవుతుందని చెప్పినట్టు డైరెక్టర్ పి. వాసు చెప్పాడు. అందుకే రజినీకాంత్ ప్లేస్‌లో లారెన్స్‌ను తీసుకున్నట్టు అలా వివరించాడు.

ఇప్పుడు చంద్రముఖి2 రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ రావడం స్టార్ట్ అయింది. దీంతో ఓ ఫ్లాప్ సినిమా నుంచి రజినీకాంత్ తప్పించుకున్నాడు అంటూ సినిమా చూసినవాళ్లు అంటున్నారు. చంద్రముఖి 2 కథలో కొత్తదనం ఏమీ లేదని, చంద్రముఖినే మళ్లీ రిలీజ్ చేసినట్టు ఉందని అంటున్నారు.

- Advertisement -

అయితే ఇక్కడ ఒక టాక్ నడుస్తుంది. చంద్రముఖి2 స్టోరీ చంద్రముఖి లానే ఉందని రజినీకాంత్ కి తెలుసని. అందుకే దాన్ని రిజెక్ట్ చేసి, రాఘవ లారెన్స్‌ని బలి చేశాడు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. కథ విన్నప్పుడు అందులో కొన్ని మార్పులు సూచించాల్సిందని అంటున్నారు.

కాగా, చంద్రముఖి2 ఫస్ట్ డే దాదాపు 7.5 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్లు తెచ్చుకుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే, 45 కోట్ల వరకు రావాలి. ప్రస్తుతం ఉన్న టాక్ ను బట్టి చూస్తే అది కష్టమే అని చెప్పొచ్చు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు