Trivikram : త్రివిక్రమ్ పై అనుమానమా.?

Guntur Kaaram

త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసినవి తక్కువ సినిమాలే అయినా వాటిలోనే ఎక్కువశాతం హిట్స్ అందుకున్నాడు. అజ్ఞాతవాసి సినిమా మినహాయిస్తే తన కెరియర్ లో ప్రేక్షకులను తీవ్ర స్థాయిలో నిరాశపరిచిన సినిమా అంటే ఏది లేదు. గాయపడిన సింహాం నుంచి వచ్చిన శ్వాస భయంకరంగా ఉంటుంది అని చెప్పినట్లు. అజ్ఞాతవాసి తో సంక్రాంతికి పోగొట్టుకున్న విజయాన్ని , అదే యేడు విజయదశమికి అరవిందసమేత సినిమాతో విజయం దక్కించుకున్నాడు.

త్రివిక్రమ్ సినిమాలు అంటే ఇంటిల్లిపాది వెళ్లి చూసి ఆనందంగా బయటకు రావొచ్చు అనుకునేంతలా ఉంటాయి.ఇప్పుడు వరకు త్రివిక్రమ్ చేసిన ప్రతి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.
2020లో వచ్చిన అలవైకుంఠపురం లో సినిమా “సరిలేరు నీకెవ్వరు” సినిమాతో పోటీగా నిలబడి మంచి కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తున్న సినిమా గుంటూరు కారం.

ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏవేవో అడ్డంకులు ఎదురవుతూ వచ్చాయి ఈ సినిమా షూటింగ్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు జరుగుతూ వస్తుంది. రిలీజ్ డేట్ కూడా ఎన్నోసార్లు అనౌన్స్ చేసి మళ్లీ వెనక్కి తగ్గింది ఈ మూవీ టీం. ఎట్టకేలకు ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ఇదివరకే ప్రకటించారు.

- Advertisement -

కానీ షూటింగ్ అప్పటికి అవ్వదనుకుని చాలా సినిమాలు సంక్రాంతిబరిలో నిలబడడానికి సిద్ధమవుతున్నాయి. హనుమాన్, ఈగల్ , నా సామి రంగ , ఫ్యామిలీ మేన్ వంటి సినిమాలు గుంటూరు కారం షూటింగ్ లేటై ఒకవేళ మళ్లీ రిలీజ్ డేట్ పోస్టుపోన్ అయితే సంక్రాంతి సీజన్ తమకు కలిసి వస్తోందని ఆలోచనలో ఉన్నాయి. మరి త్రివిక్రమ్ షూటింగ్ ను డిలే చేస్తాడు అనే అనుమానం ఎంతవరకు వీళ్లకు కలిసి వస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడకు తప్పదు.
ఒకవేళ గుంటూరు కారం సంక్రాంతికి వచ్చినట్లయితే మిగతా సినిమాలు కొంచెం వెనక తగ్గాల్సిందే.

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు