Vaishnavi Chaitanya New Movie: కెరీర్ టర్నింగ్ పాయింట్… భారీ ప్రాజెక్ట్‌లో బేబి బ్యూటీ

Vaishnavi Chaitanya New Movie

సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా క్లిక్ అవుతారో చెప్పలేం. చిన్న చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసే వాళ్లు.. ఒక్క సారిగా స్టార్‌గా ఎదిగిపోతారు. ఇలాంటివి ఇప్పటి వరకు మనం చాలా చూశాం. రీసెంట్‌గా వైష్ణవి చైతన్య విషయంలోనూ ఇదే జరిగింది. షార్ట్ ఫిల్మ్స్ నటించే అమ్మాయి… ఒకే ఒక్క సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుని స్టార్ ఇమేజ్ ను తెచ్చుకుంది.

అంతే కాదు… టాలీవుడ్‌లో దర్శక నిర్మాతల కంట కూడా పడింది. దీంతో వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కథలను విన్న వైష్ణవి చైతన్య వాటిని ఫైనల్ చేసే పనిలో ఉంది. అయితే ఈ బేబి బ్యూటీకి ఒక భారీ ప్రాజెక్ట్ లో లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. అదేంటంటే… అలనాటి నటి… తెలుగు హీరోయిన్ సౌందర్య బయోపిక్.

సౌందర్య బయోపిక్ తీయడానికి టాలీవుడ్‌లో చర్చ జరుగుతుందట. అయితే టైటిల్ రోల్ ఎవరు చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు… ఫస్ట్ ఆప్షన్ గా వైష్ణవి చైతన్య పేరే వినిపించిందని టాక్. సౌందర్య తెలుగు హీరోయిన్… ఇప్పుడు వైష్ణవి చైతన్య కూడా తెలుగు హీరోయిన్ కావడం… అందం, అభినయం కావాల్సినంత ఉండటం వైష్ణవి చైతన్యకు ప్లస్ పాయింట్స్ అయ్యాయని చెప్పొచ్చు.

- Advertisement -

ఒక వేళ అన్ని కుదరితే సౌందర్య బయోపిక్‌లో వైష్ణవి చైతన్య సెలెక్ట్ అయితే.. ఆమె కెరీర్ టర్న్ అయినట్టే. సౌందర్య బయోపిక్ మూవీ… మహానటికి మించి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాబోయే బయోపిక్ 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంతే కాదు, కీర్తి సురేష్ వచ్చిన ఫేమ్ కూడా వైష్ణవి చైతన్యకు రావొచ్చు. మొత్తంగా సౌందర్య బయోపిక్ వస్తే వైష్ణవి చైతన్య మరో కీర్తి సురేష్ అవ్వడం ఖాయం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు