Rajinikanth: సూపర్ స్టార్ పేరు కాంట్రావర్సీ లోకి కొత్త హీరో ?

Rajinikanth

ఇటీవలనే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. రమ్య కృష్ణ, తమన్నా, సునీల్, మిర్న మీనన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 10 న రిలీజై.. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమా విజయానికి ప్రధానం కారణం అవ్వగా.. చాలా రోజులు తరువాత రజినీకాంత్ స్టామినాకు తగ్గ విజయాన్ని జైలర్ సినిమా సాధించిందని చెప్పవచ్చు..

అయితే జైలర్ సినిమా విడుదలకు వారం రోజుల ముందుగా ఈ సినిమాలోని మొత్తం పాటలను రిలీజ్ చేయడానికి గాను చెన్నై లో జైలర్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. కాగా ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ లో జైలర్ సినిమాలోని హుకుం పాటకు అనిరుధ్ చేసిన పర్ఫామెన్స్ ఈవెంట్ కు హై లెట్ గా నిలిచింది.

కాగా అనిరుధ్ పర్ఫామెన్స్ తో పాటు.. రజనీకాంత్ స్పీచ్ కూడా ఆడియో లాంచ్ కార్యక్రమంలో అందరిని ఆకట్టుకుంది. అయితే రజని స్పీచ్ ఈవెంట్ కు హాజరైన అతిథులను, ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అలాగే అంతగా కాంట్రావర్సీ లకు కూడా తెర తీసింది. సూపర్ స్టార్ అనే బిరుదు తనకు ఈ మధ్య కాలంలో తనకు చాలా ప్రాబ్లంగా తయారైందని రజనీ కాంత్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.

- Advertisement -

దీనికి కారణం తమిళ్ సినీ పరిశ్రమలో రజనీకాంత్ తో పాటు సూపర్ స్టార్ అనే పేరుతో తలపతి విజయ్ ను కూడా సంబోదించటమేఅని రజనీకాంత్ వ్యాఖ్యలతో బహిర్గతమైంది. కానీ విజయ్ మాత్రం ఈ విషయంపై ఇప్పటికి స్పందించలేదు. దాంతో ఈ వివాదం ఆదిలోనే ఆగిపోయింది. ఇక లేటెస్ట్ గా ఈ వివాదంపై రజనీకాంత్ వీరాభిమాని రాఘవ లారెన్స్ కూడా స్పందించాడు. తలపతి విజయ్ సూపర్ స్టార్ అనే బిరుదును తనకు తానుగా పెట్టుకోలేదు. అభిమానులు పిలుస్తున్నారు. అందులో విజయ్ తప్పేమి లేదు అని ఆయన స్పందిచటంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు