Peddhakapu: శ్రీకాంత్ అడ్డాల కమ్ బ్యాక్ ఖాయమేనా..?

టాలీవుడ్లో ఫీల్ గుడ్ సినిమాలకు కేరాఫ్ అయిన దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల ఒకడు. కొత్తబంగారు లోకం సినిమా ద్వారా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని ఆ తర్వాత మహేష్ బాబు, వెంకటేష్ ల కాంబినేషన్లో సీతమ్మవాకిట్లో సినిమా ద్వారా టాలీవుడ్లో అంతరించిపోయే దశలో ఉన్న మల్టీస్టారర్ ట్రెండ్ కి కొత్త ఊపిరి ఊదాడని చెప్పచ్చు. ఆ తర్వాత వచ్చిన ముకుంద సినిమా కమర్షియల్ గా ఆశించిన రేంజ్ లో హిట్ అవ్వకపోవడం, బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ అవ్వటంతో రేలంగి మామ కెరీర్ కి చాలా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నారప్ప సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకున్న శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం పెదకాపు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలై సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అఖండ సినిమా నిర్మాత ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ద్వారా విరాట్ హీరోగా పరిచయం అవుతున్నాడు. 80ల కాలం నాటి రూరల్ బ్యాక్డ్రాప్ లో నడిచే పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ప్రామిసింగ్ గా అనిపిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా ఈ సినిమాలో ఓ క్యారెక్టర్లో నటిస్తుండటం విశేషం. అయితే, కథా బలం ఉన్న ఈ సినిమాకు కొత్త హీరో విరాట్ ఏ మేరకు న్యాయం చేయగలడు అన్నది ప్రశ్నగా మారింది. రావు రమేష్ కీలక పాత్రలో కనిపించి అలరించాడు ఈ టీజర్లో. ఈ సినిమా రెండు పార్ట్ లు గా రూపొందుతుండటం మరో విశేషం. మొత్తానికి తన జానర్ ని పక్కన పెట్టి సీరియస్ కథతో వస్తున్న శ్రీకాంత్ అడ్డాల కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు