SPY: అనుకున్నదొకటి – అయ్యిందొకటి..!

కార్తికేయ2 సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్, ఎడిటర్ గ్యారీ దర్శకత్వంలో రూపొందిన ‘స్పై’ సినిమా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. సుభాష్ చంద్రబోస్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ షో నుండే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ట్రైలర్ సినిమా మీద పెరిగిన ఆసక్తి కారణంగా మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ కథని ఎంగేజింగ్ గా కథని చెప్పలేకపోవటం వల్ల ఆడియెన్స్ ని థియేటర్ కి రప్పించలేకపోయింది ఈ సినిమా. సుభాష్ చంద్రబోస్ అంతర్దానం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు నార్త్ లో మంచి ఆదరణ లభిస్తుందని భావించిన సినిమా యూనిట్ ఆశలు నెరవేరలేదు.

దేశంలో అధికార బీజేపీ పార్టీ, ఆరెస్సెస్ ఎజెండా అయిన సుభాష్ చంద్రబోస్ కాన్సెప్ట్ కి నార్త్ ఆడియెన్స్ కనెక్ట్ అవుతారని భావించిన స్పై సినిమా టీమ్ కి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ట్రైలర్ లో చూపినంత ఎఫెక్టివ్ గా సినిమాలో సుభాష్ చద్రనోస్ కాన్సెప్ట్ లేకపోవటంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. కార్తికేయ ద్వారా 100కోట్ల క్లబ్ లో చేరిన నిఖిల్ కి స్పై సినిమా మరో పాన్ ఇండియా హిట్ ఇవ్వలేకపోయింది.

సినిమాలో నిఖిల్ పర్ఫామెన్స్ కి మంచి మార్కులే పడ్డప్పటికీ   కథలో బలం లేకపోవటం వల్ల సినిమా ఏ మాత్రం మెప్పించలేకపోయింది. హిందీలో క్లిక్ అవుతుందని అనుకున్న ఈ సినిమాకు నార్త్ లో కలెక్షన్స్ నామమాత్రంగానే ఉన్నాయి. ఇతర భాషలతో పోలిస్తే, తెలుగులోనే స్పై కలెక్షన్స్ కొంచెం బెటర్ అని చెప్పాలి. మరి, భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ డివైడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు