Family Star : కొండన్న కెరీర్ బెస్ట్ కొడతాడా?

Family Star : టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ కాబోతున్న క్రేజీ సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబోలో వస్తున్న సినిమా కాగా మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడన్న సంగతి తెలిసిందే. అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండ చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం కష్టపడుతున్నాడు. ‘గీతా గోవిందం’తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న రౌడీ హీరో మళ్ళీ ఆ రేంజ్ లో హిట్టు కొట్టలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లైగర్’ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఇక గతేడాది వచ్చిన ‘ఖుషి’ కూడా ఆశించినంత విజయాన్ని అందించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని గీతా గోవిందం తీసిన దర్శకుడితోనే మళ్ళీ ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కొండన్న.

ఈసారి హిట్ దక్కేనా?

‘గీత గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబోలో తెరకెక్కిన సినిమా ”ఫ్యామిలీ స్టార్”. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఇక ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ మూవీ టాక్ కోసం విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటు ‘ఫ్యామిలీ స్టార్’ రిజల్ట్ పై విజయ్ దేవరకొండ కూడా చాలా ధీమాగా ఉన్నారు. ఈ సినిమా కోసం చాలా గట్టిగా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. నిజానికి బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ పడిన తర్వాత, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’తో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాల్సిన అవసరముంది. తన మార్కెట్, స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాల్సి ఉంది. అందుకే అతని కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ చాలా కీలకమని చెప్పాలి. ఇది హిట్టయితే ఆ తర్వాత రాబోయే గౌతమ్ తిన్ననూరి సినిమాతో మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ ను టార్గెట్ చెయ్యడానికి ఛాన్స్ ఉంటుంది.

కెరీర్ బెస్ట్ కొడతాడా?

ఇక విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజీ అంచనాలుండగా, ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందని విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక విజయ్ సినిమాలు కూడా టైర్ 2 హీరోల్లో రిజల్ట్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంటాయి. లాస్ట్ ఇయర్ నటించిన ఖుషి కూడా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెచ్చుకుంది. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 12 కోట్లకి పైగా షేర్ సాధించింది. అయితే టైర్ 2 హీరోల్లో అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమా నాని నటించిన ‘దసరా’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 14 కోట్లకి పైగా షేర్ సాధించగా వరల్డ్ వైడ్ గా 18 కోట్లకి పైగా షేర్ సాధించింది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ టైర్ 2 హీరోల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కొడతాడా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఇక ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం విజయ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ లు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది. బుక్ మై షో ద్వారా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లకి పైగా బుకింగ్స్ జరగగా, వరల్డ్ వైడ్ గా 10 కోట్లకి పైగా ఓపెనింగ్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఆఫ్ లైన్ లెక్కల్ని బట్టి ఇంకా పెరిగే ఛాన్సు కూడా ఉంది. కానీ నాని దసరా ని బీట్ చేసే ఓపెనింగ్స్ మాత్రం ఈ సినిమాతో రావని అంటున్నారు నెటిజన్లు. మరి చూడాలి ఏమవుద్దో..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు