Family Star Movie : ఫ్యామిలీ స్టార్ సినిమాలో దిల్ రాజు వైఫ్

Family Star Movie : తెలుగు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. దిల్ సినిమాతో నిర్మాతగా కెరియర్ మొదలుపెట్టి శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇప్పటికీ దాదాపు 50 సినిమాలకు పైగా పూర్తి చేశారు దిల్ రాజు. దిల్ రాజు జడ్జిమెంట్ కి ఎప్పుడు ఒక వేల్యూ ఉంటుంది. దిల్ రాజు జడ్జ్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందంటూ చాలామంది అంటుంటారు. అందుకే శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో వచ్చిన సినిమాలలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు.

రీసెంట్ టైమ్స్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి వచ్చిన కొన్ని సినిమాలు ఆకట్టుకోకపోయినా. ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే కుటుంబం అంతా కలిసి హాయిగా థియేటర్ కెళ్ళి ఆ సినిమాను ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈ బ్యానర్ నుంచి వచ్చిన ఎన్నో ఫ్యామిలీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించాయి.

ఇకపోతే సంక్రాంతి సీజన్ లో సినిమాలకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలు రోజుల్లో కంటే కూడా సంక్రాంతి రోజుల్లో ఒక సినిమా వస్తే ఆ సినిమాకి కలెక్షన్స్ రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకనే దిల్ రాజ్ ప్రతి సంక్రాంతికి తన సినిమా ఒకటి ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటారు. 2024 సంక్రాంతికి కూడా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా వర్క్ పూర్తికానందువలన దాన్ని పోస్ట్ పనిచేశారు.

- Advertisement -

ఇకపోతే కొన్ని సినిమాలు అనుకున్న డేట్ కి రాకపోతే తర్వాత మంచి డైట్ దొరుకుతుందా లేదని కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతాయి. కానీ ఫ్యామిలీ స్టార్ విషయంలో అది కొంచెం బాగా కలిసి వచ్చింది అని చెప్పొచ్చు. ఏప్రిల్ 5న దేవర సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. కానీ ఆ సినిమా షూటింగ్ జరగకపోవడం వలన దేవర సినిమా పోస్ట్ పోన్ అయింది అదే డేట్ కి ఫ్యామిలీ స్టార్ సినిమాను రిలీజ్ చేస్తామని వెంటనే దిల్ రాజు అనౌన్స్ చేశారు.

ఇక పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసిన సినిమా ఫ్యామిలీ స్టార్ ( Family Star Movie ). ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాలో దిల్ రాజు వైఫ్ ఒక పాటలో కనిపిస్తారని సమాచారం వినిపిస్తుంది. ఇదివరకే దిల్ రాజు కూడా శతమానం భవతి సినిమాలో ఒక బ్రహ్మోత్సవం సీన్ లో కనిపిస్తూ ఉంటారు. అయితే మొదటిసారి దిల్ రాజు వైఫ్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గీత గోవిందం సినిమా తర్వాత పరశురాం కాంబినేషన్లో విజయ్ చేస్తున్న సినిమా ఇది. అందువలన ఈ సినిమా పైన ఎక్కువ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాలో విజయ్ సరసన మృణల్ ఠాకూర్ నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు