Meenakshi Chaudary : ఫుల్ స్వింగ్ లో మీనాక్షి.. ఎక్కడా ఆగట్లేదుగా?

Meenakshi Chaudary : టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ లీల అని చెప్పేవారు. కానీ వరుస ప్లాప్ ల వల్ల చేస్తున్న సినిమాలని కూడా హోల్డ్ లో పెట్టి, సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజను సినిమాలున్నాయి. అయితే శ్రీ లీల లాగే ఇప్పుడు తెలుగు లో ఫుల్ బిజీ అవుతున్న హీరోయిన్ ఎవరూ అంటే మీనాక్షి చౌదరి. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి హిట్2 సినిమాతో బాగా ఫేమస్ కాగా, రీసెంట్ గా గుంటూరు కారంలో మహేష్ బాబు మరదలిగా నటించింది. గుంటూరు కారంలో చేసిన పాత్ర ఒక రకంగా మొక్కుబడి పాత్రలా చిన్నగా ఏ ప్రాధాన్యం లేనట్టు ఉంటుంది. కానీ మీనాక్షి చౌదరి మాత్రం ఉన్న కాసేపు ప్రేక్షకుల్ని తన గ్లామర్ తో క్యూట్ లుక్స్ తో అట్రాక్ట్ చేసింది. ఆ ఆకర్షణతోనే ఇప్పుడు వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈ హిట్ భామ చెప్పుకోదగ్గ భారీ ఆఫర్లతో మంచి ప్లానింగ్ లోనే ఉంది.

తమిళ్, తెలుగు రెండిట్లో..

అయితే మీనాక్షి చౌదరి(Meenakshi Chaudary) చేతిలో తలపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం గోట్’ సినిమా లో ఛాన్స్ దక్కించుకోవడం ద్వారా పెద్ద జాక్ పాట్ కొట్టిందని చెప్పాలి. ఇది క్లిక్ అయితే తమిళ నిర్మాతలు ఆమె వెంటపడతారు. ఇక తెలుగులో మధ్య మధ్యలో బ్రేకులు పడుతున్నా సరే వరుణ్ తేజ్ మట్కా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా రిలీజ్ కి ప్లాన్ చేశారు. ఈ సినిమా హిట్ అయినా దశ తిరిగిపోతుంది. ఇక విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ లో కూడా నటిస్తుండగా, లేటెస్ట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూశాక హైప్ పెరిగింది. ఇదీ కాక దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ లో కూడా నటిస్తుండగా, దర్శకుడు వెంకీ అట్లూరి మీనాక్షికి ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ డిజైన్ చేశాడట. ఇక మొత్తం సెట్ల మీదున్న నాలుగు సినిమాల్లో మూడు స్ట్రెయిట్ తెలుగువే కావడం గమనించాల్సిన విషయం. ఇవే గాక మరో రెండు ఇతర భాషల సినిమాల్ని కూడా లైన్లో పెట్టిందట.

ఈ ఇయర్ టర్నింగ్ పాయింట్ వచ్చేనా?

ఇక మీనాక్షి చౌదరి మొన్నటిదాకా హిట్ ది సెకండ్ కేస్, విజయ్ ఆంటోనీ హత్య లాంటి వాటిలో, అలాగే గుంటూరు కారం లో తక్కువ ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ గా చేయగా, ఇప్పుడు మెయిన్ లీడ్ గా మారిపోవడం ప్రమోషనే అని చెప్పాలి. ఇక వీటిలో ఓ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయినా చాలు డిమాండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. రష్మిక మందన్న, శ్రీ లీల లాంటి హీరోయిన్ల కంటే ఈ సంవత్సరం ఎక్కువ సినిమాల రిలీజులు మీనాక్షి చౌదరి వే ఉండబోతున్నాయట. ఏది ఏమైనా 2024 మీనాక్షి చౌదరి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ వచ్చి స్టార్ హీరోయిన్ గా మారే ఛాన్స్ ఎంతో ఉందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు