Sreeleela : గ్యాప్ ఇవ్వలా? వచ్చింది!

Sreeleela : టాలీవుడ్ లో గత ఏడాది కాలంగా టాప్ డిమాండ్ లో అలాగే స్టార్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరు అంటే అది శ్రీ లీల అనే చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా ఇదే పేరు చెప్తారు. ఎందుకంటే 2023 లో శ్రీ లీల చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. పెళ్లి సందడి అనే చిన్న సినిమాతో పరిచయమైన ఈ భామ ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకుల్ని తన గ్లామర్ తో కట్టిపడేసింది. ఇక ధమాకా హిట్ తో ఒక్క సారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారగా, చూస్తూ చూస్తూ పెద్ద సినిమాల ఛాన్సులనే కొట్టేసింది. అయితే వరుసగా సినిమా ఆఫర్లు ఎలా అందుకుందో అలాగే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలతో వరుస ప్లాపులనూ అందుకుంది. వరుసగా స్కంద, ఆది కేశవా, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ డిజాస్టర్స్ అయ్యాయి. మధ్యలో భగవంత్ కేసరి పర్వాలేదనిపించుకున్నా అందులో శ్రీ లీల హీరోయిన్ కాదు. ఇక ఈ ఇయర్ గుంటూరు కారం భారీ అంచనాలతో వచ్చి భారీ వసూళ్లు అందుకున్నా, హిట్ స్టేటస్ ని దక్కించుకోలేదు. ఇక మళ్ళీ మరో సినిమాతో ఇంకా రాలేదు.

టాలెంట్ ఉన్నా,సెలక్షన్ లోపం?

అయితే శ్రీ లీల(Sreeleela) చేస్తున్న సినిమాలు ప్లాప్ అవడానికి కారణం ఏదైనా శ్రీ లీల చేస్తున్న తప్పు సినిమా సెలక్షన్. ఎలాంటి సినిమా అయినా స్క్రిప్ట్ కూడా సరిగా వినకుండా ఆ సినిమాలని ఒకే చేసినట్టు అనిపిస్తుంది. శ్రీ లీల చేసిన సినిమాలన్నీటి లో ఒక్క దాంట్లో కూడా సరిగా పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్ చేయలేదు. భగవంత్ కేసరిలో మంచి పాత్ర చేసినా అది హీరోయిన్ రోల్ కాదు. అందువల్ల శ్రీ లీలకి వరుస ప్లాప్ లు వచ్చాయని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు శ్రీ లీల ఒకే చెప్పిన సినిమాలు కాకుండా కొత్త ప్రాజెక్టులకు మాత్రం ఏది ఒకే చెప్పలేదు. కొత్తగా చెప్తున్న కథలన్నిటిని రిజెక్ట్ చేస్తుందట. అయితే అలా కొత్త కథల్ని ఒప్పుకోకపోవడానికి కారణం కూడా వేరే ఉంది.

అందుకే సినిమాలకు గ్యాప్!

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో మొన్నటివరకు చాలా బిజీగా ఉన్న శ్రీలీల, ప్రస్తుతం సినిమాలకి గ్యాప్ ఇచ్చింది. గత ఏడాది మూడు డిజాస్టర్లు అందుకుంది. ఆదికేశవ, స్కంద, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ మంచి అంచనాల మధ్య తీవ్రంగా నిరాశపరచగా, ప్లాప్ ల నుండి తేరుకుని తనని తాను అప్డేట్ చేసుకుంది. ముందుగా పెండింగ్ లో ఉన్న సినిమాలని పూర్తి చేయాలనీ కొత్తగా ఏ సినిమా ఒప్పుకోవట్లేదు. అయితే అసలు కారణం మాత్రం తన ఎడ్యుకేషన్ గురించే అని సమాచారం. శ్రీ లీల డాక్టర్ చదువుతుందని తెలిసిందే. ప్రస్తుతం తన ఎంబిబిఎస్ పరీక్షల కోసం గ్యాప్ తీసుకుందని సమాచారం. అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చింది కానీ, కావాలని ఇచ్చింది కాదు, అలా గ్యాప్ వచ్చింది అంతే అని తెలుస్తుంది. ఇక శ్రీలీల చేతిలో ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే అఫిషియల్ గా పెండింగ్ ఉన్న కమిట్ మెంట్ ప్రాజెక్ట్ అట. మిగతా సినిమాల్లో కొన్నిటిని హోల్డ్ లో పెట్టగా, మరికొన్ని రిజెక్ట్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు