Rc16 Release Update : Rc16 రిలీజ్ అయ్యేది అప్పుడే

Rc16 Release Update : పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిరుత సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ తేజ్. అయితే మొదటి సినిమాతోనే చిరు తనయుడు అనిపించుకుని డాన్స్ లోను నటనలోనూ కూడా పర్ఫెక్ట్ గా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు అని చెప్పొచ్చు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఘనవిజయాన్ని సాధించింది. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమా మగధీర. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది.

మగధీర సినిమా తోనే ఒక స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్. అయితే ఆ సినిమా తర్వాత తన కెరీర్లో హిట్ సినిమా చూడ్డానికి దాదాపు చాలా ఏళ్లు పట్టింది చరణ్ కి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత చేసిన రచ్చ, ఎవడు, నాయక్, సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకున్నాయి. అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధ్రువ సినిమా మళ్లీ మంచి పేరుని తీసుకొచ్చింది చరణ్ కి.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేసిన రంగస్థలం సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి రాంచరణ్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడు అంటూ ప్రూవ్ చేసింది. కేవలం రామ్ చరణ్ లోని ఇంత గొప్ప నటుడు ఉన్నాడని ప్రూవ్ చేయడమే కాకుండా సుకుమార్ లో ఈ కోణం కూడా ఉంది అని ప్రూవ్ చేసింది రంగస్థలం సినిమా. ఒక విలేజ్ పొలిటికల్ డ్రామా ని అంత అద్భుతంగా తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించుకున్నాడు సుకుమార్.

- Advertisement -

అయితే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తను దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతోనే 100 కోట్లు మార్కెట్ ను దాటాడు. మొదటి సినిమాతోనే 100 కోట్లు రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని కొంతకాలం పాటు వెయిట్ చేస్తూ వచ్చాడు బుచ్చిబాబు. అయితే ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వలన పట్టాలెక్కలేదు.

కానీ ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమాను చేస్తున్నాడు బుచ్చిబాబు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా రీసెంట్ గానే జరిగింది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో జరగనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా ( Rc16 Release Update )లో రాంచరణ్ సరసన జాన్వి కపూర్ నటిస్తుంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా 2025లో రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత మళ్లీ సుకుమార్ తో సినిమాను చేయనున్నాడు రామ్ చరణ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు