Devara Movie Update : ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవచ్చు

Devara Movie Update : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప దర్శకులు ఉన్నారు అయితే గెలుపు ఓటములు సహజమైనట్లు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకులకు హిట్లు ప్లాపులు కూడా సహజమని చెప్పొచ్చు. మిర్చి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు కొరటాల శివ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ప్రభాస్ బాహుబలి కి ముందు ఈ సినిమా చేయటంతో ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది. అయినా కానీ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాను చేసే అవకాశం దక్కించుకున్నాడు కొరటాల శివ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన శ్రీమంతుడు అనే సినిమాను మహేష్ బాబుతో తీసాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధించి దాదాపు 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ అనే సినిమాను తీసాడు శివ. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది.

జనతా గ్యారేజ్ సినిమా తర్వాత మరోసారి మహేష్ బాబుతో చేతులు కలిపి భరత్ అనే నేను సినిమాను తెరకెక్కించాడు. అయితే వరుసగా నాలుగు సూపర్ హిట్ సినిమాలు తీసిన కొరటాల శివకి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం దక్కింది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనేది చాలామందికి ఉన్న డ్రీం ప్రాజెక్ట్. కానీ అందరికీ అది కుదరలేదు. కానీ కొరటాల శివకు మాత్రం కుదిరింది. అయితే కొరటాల శివ కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్ అంటే ఆచార్య అని చెప్పొచ్చు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత కొన్ని రోజులు బయట కనిపించలేదు కొరటాల శివ.

- Advertisement -

ఇక ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా దేవర ( Devara Movie Update ). ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఇదివరకే వచ్చిన టీజర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ సాధించుకుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఏప్రిల్ మంత్ ఎండ్ కి కంప్లీట్ గా టాకీ పార్ట్ తో పాటు డైలాగ్స్ కూడా పూర్తయిపోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమాకి కోలీవుడ్ సంచలన సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకే ఈ సినిమాకి సంబంధించిన మూడు పాటలను ఆల్రెడీ ఫినిష్ చేసినట్లు సమాచారం. ఇంకో మూడు పాటలను అనిరుద్ చేయనున్నాడట. ఈ సినిమాతో సక్సెస్ ను కొట్టి ప్రూవ్ చేసుకోవడానికి కొరటాల శివ వెయిట్ చేస్తున్నాడు. అనిరుధ్ ఇదివరకే ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమాకి సంగీతం అందించాలి. కానీ అంతకుముందు త్రివిక్రమ్ చేసిన అజ్ఞాతవాసి సినిమా ఫెయిల్ అవ్వడంతో అరవింద సమేత వీర రాఘవ సినిమాకి అనిరుధ్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తొలగించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ అయితే ఒకవైపు అనిరుధ్ కి మరోవైపు కొరటాల శివ కూడా మంచి కం బ్యాక్ అవుతుంది అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు