Project Z : ఏడేళ్ల సినిమా మళ్ళీ రిలీజ్? అవసరమా?

Project Z : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఇయర్ ఊరు పేరు భైరవకోన తో ఎట్టకేలకు ట్రాక్ లో పడగా, సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ లేనంతగా సందడి చేస్తున్నాడు. అలాగే వరుస ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. ఇదిలా ఉండగా ఈ హీరో దాదాపు పదేళ్ల పాటు సరైన సక్సెస్ లేకా ఆల్మోస్ట్ ఫేడవుట్ అయే స్టేజికి వచ్చాడు. అయితే సందీప్ కిషన్ చేసిన సినిమాల్లో కొన్ని మంచి సినిమాలు కూడా ఉన్నాయి. అవి రిలీజ్ అయిన టైం లో పలు కారణాల వల్ల ఏమాత్రం ఆడలేదు. అలాంటి సినిమాల్లో ‘మాయవన్’ అనే తమిళ సినిమా కూడా ఉంది. మన సందీప్ కిషన్ అందులో హీరో. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది. ఇక తమిళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీస్‌లో ఈ సినిమాని కూడా ఒకటిగా చెప్తారు. తమిళ్ లో నిర్మాతగా పిజ్జా, సూదు కవ్వుం లాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేసి తన అభిరుచిని చాటుకున్న సీవీ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సరికొత్త కాన్సెప్ట్‌తో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగే ఈ సినిమా తమిళంలో యావరేజ్ గా ఆడింది. అయితే తెలుగులో ప్రాజెక్ట్ Z గా ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ అయింది.

ఇప్పుడు రిలీజ్ ఎందుకు?

అయితే ప్రాజెక్ట్ Z(Project Z ) ఇప్పడు తెలుగులో మళ్ళీ రిలీజ్ అవుతుంది. నిజానికి ప్రాజెక్ట్ Z (మాయావన్) ఎప్పుడో 2017లో విడుదలకాగా, ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రాజెక్ట్-Z పేరుతో ఈ శుక్రవారమే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇక తమిళంలో విడుదలైన ఏడేళ్ల తర్వాత తెలుగులోకి వస్తుండటం విడ్డూరంగా అనిపిస్తోంది. నిజానికి ‘మాయవన్’ తమిళంలో రిలీజ్ అయిన టైంలోనే ‘ప్రాజెక్ట్-Z’ పేరుతో తెలుగులో అనువాదం చేశారు. రిలీజ్‌కు సన్నాహాలు కూడా చేశారు. కానీ ఏవో కారణాలతో అది అప్పుడు విడుదల కాలేదు. ఆ తర్వాత తెలుగు వెర్షన్ డైరెక్ట్ గా ఆన్ లైన్లో రిలీజైంది. చాలామంది తెలుగులోనే ఈ సినిమా చూశారు కూడా. కానీ ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి ఏం సాధిస్తారన్నది అర్థం కాని విషయం.

పట్టించుకునే ఛాన్స్ లేదంటున్నారు?

అయితే తమిళంలో ‘మాయవన్’కు ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది. సీవీ కుమారే దర్శకుడు, సందీప్ కిషనే హీరో. దీన్ని తమిళంతో పాటే తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ పార్ట్ తెలుగు వెర్షన్‌ను మళ్ళీ రిలీజ్ చేస్తున్నట్లున్నారు. కానీ ఇన్నేళ్ల తర్వాత పెద్దగా పబ్లిసిటీ కూడా లేకుండా థియేటర్లలో రిలీజయ్యే సినిమాను ప్రేక్షకులు పట్టించుకోవడం కష్టమే. ఇది వృథా ప్రయాస అని ట్రేడ్ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రాజెక్ట్ Z సినిమాని ఇప్పటికే చాలా మంది చూసేయగా, యూట్యూబ్ లో కూడా సినిమా అందుబాటులో ఉంది. అలాంటప్పుడు థియేటర్లకు జనాలు ఎలా వస్తారన్న విషయం మేకర్స్ ఆలోచించాల్సింది. కనీసం జనాలకి తెలిసేలా ప్రమోషన్లు చేసి ఉంటె ఒకటి రెండు థియేటర్లకు అయినా ఆడియన్స్ వచ్చే ఛాన్స్ ఉండేది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు