Family Star OTT : ఫ్యామిలీ స్టార్ ఓటిటీ ప్లాట్ ఫామ్ ఛేంజ్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Family Star OTT : విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఏ ఓటిటిలో రాబోతుందనే విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం ప్రచారం జరిగినట్టుగా నెట్ ఫ్లిక్స్ లో కాకుండా మరో ఓటిటి అమెజాన్ లో ఫ్యామిలీ స్టార్ రాబోతున్నాడు.

ఫ్యామిలీ స్టార్ ఓటిటిలో ఎప్పుడంటే ?

గత కొన్ని రోజుల నుంచి ఫ్యామిలీ స్టార్ మూవీ ఓటిటి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందనే ప్రచారం జరిగింది. దాదాపు 16 కోట్లకు ఈ మూవీ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని టాలీవుడ్ లో రూమర్లు నడిచాయి. అయితే ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ తాజాగా ఫ్యామిలీ స్టార్ ఓటిటి ప్లాట్ ఫామ్ అఫీషియల్ గా ఫిక్స్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. నిజానికి మార్చ్ లో జరిగిన అమెజాన్ స్పెషల్ ఈవెంట్ లోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. అంతకు ముందు వరకు అందరూ ఫ్యామిలీ స్టార్ నెట్ ఫ్లిక్స్ లోనే ప్రసారం కాబోతోందని అనుకున్నారు. ఫ్యామిలీ స్టార్ ఈరోజే రిలీజ్ కావడంతో మరోసారి ఈ మూవీ ఎప్పుడుఎం ఏ ఓటిటిలో రాబోతుందనే విషయంపై దృష్టి పెట్టారు నెటిజన్లు. థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు నుంచి 6 వారాల తరువాతే ఫ్యామిలీ స్టోర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాబోతోంది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మే రెండవ వారం లేదా మూడవ వారంలో ఫ్యామిలీ స్టార్ ఓటిటి స్ట్రీమింగ్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఫ్యామిలీ స్టార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే…

ఫ్యామిలీ స్టార్ కు ఊహించిన దాని కంటే భారీగానే ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ 43 కోట్లకు అమ్ముడు కావడం విశేషం. 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఫ్యామిలీ స్టార్ ఈ ఫ్రైడే రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురాం కాంబోకు ఉన్న క్రేజ్, ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఫ్యామిలీ స్టోరీల పట్ల ఉన్న పట్టు కారణంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. మూవీ ప్రమోషనల్ కంటెంట్ కు పాజిటివ్ వైబ్స్ వచ్చినప్పటికీ, ప్రస్తుతం నెగిటివ్ టాక్ నడుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఈ మూవీపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్లు. సినిమాలో చూపించిన మిడిల్ క్లాస్ కష్టాలు కన్వీన్సింగ్ గా లేవని, సెంటిమెంట్ పండలేదని, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ అసలు వర్కౌట్ కాలేదని ట్వీట్లు చేస్తున్నారు. ఈ మూవీతో విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ప్లాప్ పడినట్టేనని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ స్టార్ బ్రేక్ ఈవెన్ సాధిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు