Rashmika Mandanna First Look : రష్మిక బర్త్ డే ట్రీట్… శ్రీవల్లి ఫస్ట్ లుక్ అవుట్

Rashmika Mandanna First Look : నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చారు పుష్ప 2 టీం. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2: ది రూల్ మూవీ నుంచి రష్మిక ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ఆమె అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. మరి సీక్వెల్ లో శ్రీవల్లి లుక్ ఎలా ఉంది? అనే విషయంలోకి వెళ్తే….

శ్రీవల్లి లుక్ ఎలా ఉందంటే…

రష్మిక మందన్న, అల్లు అర్జున్ జంటగా నటించిన పుష్ప మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దానికి సీక్వెల్ గా పుష్ప 2ను రూపొందిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. అయితే ఇటీవల రష్మిక పుష్ప 2 గురించి చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఈసారి మరింత ఇంట్రెస్టింగ్ గా, అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పి హైప్ పెంచేసింది రష్మిక. తాజాగా ఆమె పుట్టినరోజు కానుకగా రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్ర లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో రష్మిక మందన్న పట్టు చీర కట్టుకుని, భారీ ఆభరణాలు ధరించి డ్యాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆమె ముఖంలోని భావాలు స్ట్రాంగ్ గా ఉండగా, సీరియస్ గా ఉన్నట్టు కన్పిస్తోంది. అలాగే శ్రీవల్లి నుదుటిపై కుంకుమ పెట్టుకుని కన్పించింది. పుష్ప మూవీ క్లైమాక్స్ లో పుష్ప రాజ్, శ్రీవల్లి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రష్మిక లుక్ అట్రాక్టివ్ గా ఉండడంతో ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలోకి రాబోతోంది.

- Advertisement -

ది గర్ల్ ఫ్రెండ్ నుంచి మరో ట్రీట్…

ఇక రష్మిక మందన్న పుట్టినరోజు కానుకగా ది గర్ల్ ఫ్రెండ్ చిత్ర యూనిట్ నేషనల్ క్రష్ ఫ్యాన్స్ కు మరో స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీలో నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ ( Rashmika Mandanna First Look ) ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో రష్మిక ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటుంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం 1990ల కాలం నాటిని తలపించడం విశేషం. ఓల్డ్ మోడల్ వాచ్ ను చేతికి ధరించి కాలేజీ అమ్మాయిగా కనిపిస్తోంది. ఆమె పెదాల కంటే ముందు కళ్ళే చిరునవ్వులను చిందిస్తాయి. ఆమె మాట్లాడడానికంటే ముందే ఆ కళ్ళు ఎన్నో అందమైన భావాలను పలికిస్తాయి అంటూ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ఫోన్ కు దాదాపు ఐదేళ్లు దూరంగా ఉన్న రాహుల్ ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో మరోసారి డైరెక్టర్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్నకు జోడిగా దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప 2, ఐ గర్ల్ ఫ్రెండ్, ధనుష్, శేఖర్ కమ్ముల మూవీ ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు