Venuswamy: పరువు తీసిన సెలబ్రిటీ స్టార్స్.. టార్గెట్ చేశారా..?

Venuswamy.. ప్రముఖ ఆస్ట్రాలజర్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన జ్యోతిష్యుడు వేణు స్వామి.. సెలబ్రిటీల జాతకాల పై, వారి వ్యక్తిగత జీవితాలపై అలాగే కెరియర్ పై కూడా జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.. అయితే ఒక్కోసారి ఈయన చెప్పే జ్యోతిష్యం నిజమైతే.. మరొకసారి బెడిసి కొడుతూ ఉంటుంది.. అలా బెడిసి కొట్టినప్పుడు నెటిజన్స్ భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలపై సెలబ్రిటీలు మాత్రం ఏ రోజు స్పందించలేదు.. కానీ తాజాగా సెలబ్రిటీలు వేణు స్వామిని టార్గెట్ చేస్తూ ఆయన పరువు పోయేలా చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

వేణు స్వామే టార్గెట్..
ఎప్పుడు సెలబ్రిటీలను టార్గెట్ చేసే వేణు స్వామిని ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఉగాది పండుగ రానున్న నేపథ్యంలో ఒక ఛానల్ వారు నిర్వహించిన షోలో వేణు స్వామిని టార్గెట్ చేస్తూ సెటైర్ల వర్షం కురిపించారు సెలబ్రెటీలు. యాంకర్ గా, కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి ఫ్యామిలీ స్టార్ ఉగాది ఉమ్మడి కుటుంబం అనే షోలో పాల్గొన్నారు.. ఈ షో కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ షోలో బిత్తిరి సత్తి వేణు స్వామి గెటప్ లో కనిపించారు. నా పేరు ‘వేలు స్వామి’ అంటూ బిత్తిరి సత్తి ఎంట్రీ ఇచ్చారు.. వేణు స్వామి తరహాలో ప్రతి సెలబ్రిటీ దగ్గరికి వెళ్లి కాంట్రవర్సీ తరహాలో జ్యోతిష్యం చెబుతూ.. ఎవరిని వదలకుండా అందరిపై కామెంట్స్ చేసి..నవ్వించారు బిత్తిరి సత్తి..

షో లో సందడి..
ముందుగా అలీ దగ్గరకు వెళ్లి ఏపీలో మే నెలలో ఏం జరగబోతుందో చెబుతాను అని అన్నాడు.. ఏదో సంచలన విషయం చెబుతాడు అని ఆలీ ఉత్కంఠ గా ఎదురు చూడగా.. కానీ బిత్తిరి సత్తి ఏపీలో మే నెలలో ఇంకా ఎండలు బాగా పెరుగుతాయి అని చెప్పారు.. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.. తర్వాత హీరోయిన్ రాశీ దగ్గరకు వెళ్లి.. నేను ఇంతకు ముందే చెప్పా మీరు ఒక ప్రముఖ హీరో మీద చెయ్యి వేసుకుంటారని అన్నాడు. దీంతో రాశీ..అయ్యో నేను అలా చేయలేదండి అని చెప్పింది..చేయి వేసుకున్నారు కదా అంటూ సత్తి ఒక వీడియో చూపించబోయారు. అయితే ఇటీవల వైరల్ అయిన శ్రీకాంత్ వీడియో అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. కస్తూరి జాతకం కూడా చెప్పాడు. మీరు హీరోయిన్గా నటించిన సినిమా త్వరలో రీ రిలీజ్ అవుతుందని చెప్పాడు.. నేను నటించిన అంత సూపర్ హిట్ మూవీ ఏంటబ్బా అని ఆలోచిస్తూ ఉండిపోయింది కస్తూరీ.. ఇక అన్ని సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి కదా అన్నమయ్య రి రిలీజ్ కాకూడదా అని సత్తి ప్రశ్నించాడు. ఇలా మొత్తానికి జాతకాలు చెబుతూ వేణు స్వామి రేంజ్ లో బిత్తిరి సత్తి చేసిన నటన అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా నెటిజన్లు కొంతమంది వేణు స్వామిని టార్గెట్ చేసి మరీ పరువు తీసారుగా అంటూ కామెంట్ లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు