HBD Rashmika Mandanna : రష్మిక టాటూ సీక్రెట్… అతనికి బుద్ధి చెప్పడానికే

HBD Rashmika Mandanna : ఛలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ రష్మిక మందన్న అతి తక్కువ కాలంలోనే నేషనల్ క్రష్ గా మారిపోయింది. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక రేంజ్, పాపులారిటీ పుష్ప, యానిమల్స్ వంటి సినిమాలతో మరింతగా ఎదిగిపోయింది. ప్రస్తుతం అటు నార్త్, ఇటు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రష్మిక స్టార్ డం పీక్స్ లో ఉంది. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది. ముఖ్యంగా ఆమె టాటూ సీక్రెట్ ను రివిల్ చేసింది. ఒక వ్యక్తికి బుద్ధి చెప్పడానికి ఆ టాటూ వేయించుకుందట. మరి ఇంతకీ ఎవరా వ్యక్తి? రష్మిక ఎందుకు అతనికి బుద్ధి చెప్పాలనుకుంది? ఆ టాటూకు అర్థం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

అతనికి బుద్ధి చెప్పడానికే టాటూ…

తాజాగా రష్మిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన టాటూ సీక్రెట్ ను వెల్లడించింది. ముందుగా తనకు టాటూ వేయించుకోవాలని అనిపించేది కాదని, కానీ కాలేజీలో ఓ అబ్బాయి ఆడపిల్లలు బాధను ఓర్చుకోలేరని, వాళ్లకు కనీసం సూదులన్నా కూడా భయమేనని కామెంట్ చేశాడని గుర్తు చేసుకుంది. అతని అభిప్రాయం తప్పు అని నిరూపించాలనే పట్టుదలతోనే తాను టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే అసలు టాటూగా ఏం వేయించుకోవాలి అని చాలా సేపు ఆలోచించాక తనకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందని, దాని ప్రకారమే ఇర్రిప్లేసబుల్ అని వేయించుకున్నానని వెల్లడించింది. ఈ టాటూ అర్థం ఏ ఒక్కరు కూడా మరొకరిని భర్తీ చేయలేరని అర్థమట. ఈ విషయాన్ని తాను బాగా నమ్మడం వల్లనే ఆ పదాన్ని టాటూగా వేయించుకున్నానని రష్మిక చెప్పుకొచ్చింది.

రష్మిక సినిమాల విషయానికి వస్తే…

ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్న షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 అనే ఫ్యాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా రష్మిక బర్త్ డే ( HBD Rashmika Mandanna ) కానుకగా పుష్ప 2 నుంచి ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీతో పాటు తెలుగులో చిలసౌ ఫేం డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక.

- Advertisement -

ఈ మూవీ నుంచి కూడా రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ కోసం రష్మిక ఏకంగా ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పిందట. వీటితో పాటు రష్మిక చేతిలో రెయిన్ బో అనే బైలింగ్వల్ మూవీ, చావా అనే హిస్టారికల్ యాక్షన్ హిందీ డ్రామా, బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ కూడా ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు