Santhi Swaroop : తెలుగు యాంకర్ మృతి..!

Santhi Swaroop : ఈ మధ్యకాలంలో గత ఏడాది నుంచి సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులవుతూ అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు.. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ప్రముఖ తెలుగు సీనియర్ న్యూస్ యాంకర్ గా దూరదర్శన్ లో గుర్తింపు తెచ్చుకున్న శాంతి స్వరూప్ స్వర్గస్తులయ్యారు.. గుండెపోటుతో చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు.. శాంతి స్వరూప్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులే.. మొదట ఆయన తెలుగులో వార్తలు చదివి తొలి యాంకర్ అయ్యారు..

తెలుగు న్యూస్ రీడర్స్ ఆరాధ్య దైవం..

ఇప్పటికీ తెలుగు న్యూస్ రీడర్స్ ఎంతోమందికి ఈయన గురువు.. 1978లో దూరదర్శన్ లో న్యూస్ చదవడానికి జాబ్ లో చేరిన శాంతి స్వరూప్ కు వార్తలు చదివేందుకు 1983 వరకు వేచి చూడాల్సి వచ్చింది.. అయితే 2011లో ఆయన పదవీ విరమణ చేశారు.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం మనకు కనీసం టెలీ ప్రాంప్టర్ కూడా లేదు.. అందుకే అప్పట్లో స్క్రిప్ట్ పేపర్లను బట్టీ పట్టి మరి వార్తలు చెప్పేవారు శాంతి స్వరూప్. ఆయన వార్తలు చదవడం ప్రారంభించిన దాదాపు పది సంవత్సరాల వరకు అదే పరిస్థితి కొనసాగింది..

అందరూ భయపడేవారు..

అయితే ఒకానొక సమయంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శాంతి స్వరూప్ మాట్లాడుతూ.. దాదాపు పది సంవత్సరాలపాటు టెలీ ప్రాంప్టర్ లేదు. తప్పులు జరగకుండా చాలా బట్టీ పట్టి మరి వార్తలు చదివే వాడిని.. అయితే నేనలా వార్తలు చదివేటప్పుడు మిగిలిన వారందరూ భయపడేవారు.. ఎక్కడ నేను తప్పులు చదువుతానో అని అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శాంతి స్వరూప్..

- Advertisement -

యాంకరే కాదు మంచి రచయిత కూడా..

ఇకపోతే శాంతి స్వరూప్ ఒక యాంకర్ మాత్రమే కాదు మంచి రచయితగా కూడా పేరు దక్కించుకున్నారు.. భోపాల్ గ్యాస్ దుర్ఘటన మీద రాసిన ‘రాతిమేఘం’ అనే నవల ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘క్రికెట్ పైన క్రేజ్ ‘ అనే నవల సతీ సహగమనాన్ని వ్యతిరేకిస్తూ ‘అర్థాగ్ని’ అనే నవలలు కూడా రచించారు శాంతి స్వరూప్..

శాంతి స్వరూప్ కెరియర్..

హైదరాబాదులో పుట్టి పెరిగారు శాంతి స్వరూప్ ( Santhi Swaroop ). ఈయన చిన్ననాటనే తండ్రి, ఆ తర్వాత పెంచి పెద్ద చేసిన అన్నయ్య మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ ఈయన పైనే పడ్డాయి.. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి మంచి యాంకర్ గా పేరు తెచ్చుకున్నారు.. 1980లో సహ సీనియర్ యాంకర్ రోజా రాణిని జీవిత భాగస్వామిగా చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు.. ప్రస్తుతం వారిద్దరూ కూడా ఐఐటీ చేసి అమెరికాలో స్థిరపడ్డారు.. ఇలా యాంకర్ గా , రచయితగా మంచి పేరు దక్కించుకున్న శాంతి స్వరూప్ నేడు మన మధ్య లేకపోవడం తెలుగు వారిని కదిలిస్తోంది. ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.. పలువురు సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి మరీ భౌతిక కాయాన్ని సందర్శించి.. వారి కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.. ఏది ఏమైనా ఇంతటి గొప్పవారు అంత త్వరగా మనల్ని వదిలి వెళ్ళడం బాధాకరమనే చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు