Jr NTR : 100 కోట్ల ఛాన్స్ మిస్ చేసుకున్న తారక్

Jr NTR : ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులను చూసి అరెరే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 100 కోట్ల ఛాన్స్ ను తారక్ మిస్ చేసుకున్నాడని ఫీల్ అవుతున్నారు ఆయన అభిమానులు. వీళ్ళు ఇలా ఫీల్ అవ్వడానికి అసలు కారణం ఏమిటి? ఆ 100 కోట్ల ఛాన్స్ ను తారక్ ఎలా మిస్ చేసుకున్నాడు? అనే వివరాల్లోకి వెళితే…

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్లకు 100 కోట్ల క్లబ్ అనేది అసలు విషయమే కాదు. వీలైతే 1000 కోట్ల క్లబ్ లో, లేదంటే కనీసం 500 కోట్ల క్లబ్ లో చేరాలనే టార్గెట్ తోనే సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా వరకు పెద్ద సినిమాలు రిలీజ్ అయిన మొదటి రోజే 100 కోట్ల క్లబ్ లో చేరిన అరుదైన ఘనతను సొంతం చేసుకుంటున్నాయి. ఈ అరుదైన రికార్డును క్రియేట్ చేసే ఛాన్స్ ను ఎన్టీఆర్ మిస్ చేసుకున్నాడు అనే టాక్ నడుస్తోంది ప్రస్తుతం. దర్శక దీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు తారక్. దీంతో ప్రస్తుతం తారక్ అభిమానులు అందరి దృష్టి ఆయన నెక్స్ట్ మూవీ దేవర పైనే ఉంది. ఈ మూవీని ముందుగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల దేవర రిలీజ్ వాయిదా పడింది. అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యి ఉంటే దేవర పక్కాగా రికార్డులను బ్రేక్ చేసేది.

ఏప్రిల్ 5 అనేది నిజానికి గోల్డెన్ రిలీజ్ డేట్ అని చెప్పొచ్చు. సమ్మర్ హాలిడేస్ తో పాటు పలు పండగలు కూడా కలిసి వచ్చాయి. అంతేకాకుండా సమ్మర్ లో ఇతర స్టార్ హీరోలు సినిమాలు పోటీలో లేకపోవడంతో ఈ సమయంలో దేవర వచ్చి ఉంటే నిర్మాతలకు కాసుల వర్షం కురిసేది. టీజర్ ఇప్పటికే రిలీజ్ అయి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ట్రైలర్ కు కూడా అదే మ్యాజిక్ కంటిన్యూ అయ్యి ఏప్రిల్ 5న దేవర బొమ్మ సిల్వర్ స్క్రీన్ పై పడి ఉంటే మొదటి రోజే ఈ మూవీ కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లోనే అరుదైన రికార్డును సాధించిన మూవీగా నిలిచిపోయేది. కానీ దేవర మూవీ పలు కారణాల వల్ల అనుకున్న సమయానికి రిలీజ్ కాలేదు. ప్రస్తుతం టిల్లు గానీ సందడి నడుస్తోంది. టిల్లు స్క్వేర్ మూవీ తాజాగా 100 కోట్లు సాధించిన నేపథ్యంలోనే ఎన్టీఆర్ అభిమానులు ఈ విధంగా ఫీల్ అవుతున్నారు. మరి దసరాకు థియేటర్లలోకి రాబోతున్న దేవర కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

- Advertisement -

దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా, ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే ఆమెకు తెలుగులో మొదటి చిత్రం. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ మూవీలో కీలకపాత్రను పోషిస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో 2016లో జనతా గ్యారేజ్ అనే మూవీ వచ్చిన విషయం తెలిసిందే. మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండడంతో దేవర మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ మూవీలో తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు