Family Star : ఫ్యామిలీ స్టార్ కి ఇలాంటి ఓపెనింగ్స్ రావడానికి ఈ రెండే కారణాలు!

Family Star : టాలీవుడ్ లో ఈ వారం భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన క్రేజీ సినిమా ఫ్యామిలీ స్టార్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో సినిమా రావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఎన్నో భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 5న రిలీజ్ అయింది. అయితే ప్రీమియర్స్ నుండే ఈ సినిమా అంతగా లేదని నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక అది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో బాగా స్ప్రెడ్ అయిపొయింది. అయినా విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ వస్తాయి అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా విజయ్ కెరీర్ లో గత ఐదారేళ్లలో వచ్చిన సినిమాల కంటే లోయెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. రిలీజ్ అయిన ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా కేవలం 6.30 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. అయితే ఫ్యామిలీ స్టార్ కి ఇంత దారుణమైన ఓపెనింగ్స్ రావడానికి మాత్రం రెండు ప్రధాన కారణాలు అని తెలుస్తుంది.

విజయ్ నోటి దూల..

విజయ్ దేవరకొండ మీడియం రేంజ్ హీరో నుండి స్టార్ అవడానికి చాలా సార్లు ఛాన్స్ వచ్చినా దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. దానికి కారణం తన వ్యక్తిగత ప్రవర్తనే. ఎన్నో కష్టాలు పడి వచ్చిన రవితేజ, నాని లాంటి స్టార్ లు ఇంతగా ఎదగడానికి వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తన తో పాటు, ఫ్యాన్స్ తో బిహేవియర్, ఇతర హీరోలతో వాళ్ళ స్థాయికి తగ్గట్టు పెద్దలకి మర్యాద ఇవ్వడం ఇవన్నీ వాళ్ళ ఎదుగుదలకు దోహదపడ్డాయి. కానీ విజయ్ లో గీతా గోవిందం తర్వాత అవి అంతగా కనిపించలేదు. ముఖ్యంగా ఆ మధ్య మా అమ్మ అయ్యా కూడా తెల్వదు మీకు ఇంత ప్రేమ చుపిస్తున్నారేందిరా అని తనని తాను లేపుకుని క్రమంలో బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన స్టార్ హీరోల ఫ్యాన్స్ ని హర్ట్ చేసాడు. దాని వల్ల ఆయా హీరోల ఫ్యాన్స్ పెద్దగా విజయ్ సినిమాలు చూడ్డానికి ఇష్టపడలేదు. గతం పక్కనపెడితే లేటెస్ట్ గా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం లో బైక్ పై హీరోయిన్ ని తీసుకుని ఈవెంట్ బయటికి వస్తూ, ఫ్యాన్స్ ని జరగండ్రా నీయమ్మా.. అంటూ ఏదో క్యాజువల్ గా వాడాడు. దీంతో కామన్ ఆడియన్స్ ఫ్యాన్స్ అయినంత మాత్రాన అలాంటి పదాలు వాడడమేంటి అని జనాలు ఫైర్ అయ్యారు. ఇక విజయ్ ఫ్యాన్స్ కొందరు మాత్రం తెలంగాణలో ఇట్లనే బూతులు కామన్ గా వాడుతారు. అలా అంటే అన్నట్టు కాదు అని సమర్ధించుకొస్తున్నారు. నిజానికి తెలంగాణ హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ ఒక సెలెబ్రిటీ స్థాయికి వచ్చాక ఇలాంటి నోటి దూల పనికి రాదని పలువురి అభిప్రాయం.

ఫ్యామిలీ ని ఇబ్బంది పెట్టిన రొమాన్స్..

ఫ్యామిలీ స్టార్(Family Star) అంటూ ఫ్యామిలీ ప్రేక్షకులే టార్గెట్ గా పక్కా ఫ్యామిలీ సినిమా అంటూ నిర్మాత దిల్ రాజు రుద్ది మరీ చెప్పాడు. కానీ సినిమాలో మాత్రం కొన్ని రొమాంటిక్ సీన్స్, ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్ ఫ్యామిలీ ప్రేక్షకులని చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పొచ్చు. ఏ సెంటర్ల ప్రేక్షకులు కాస్త లైట్ తీసుకున్నా, బి,సి సెంటర్ల ప్రేక్షకులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ అని మేకర్స్ చెప్పింది విని వచ్చి సినిమా చూస్తే ఇంకేదో ఉంది. దాంతో మొదటికే మోసం వచ్చి ఫ్యామిలీ ప్రేక్షకులు పూర్తిగా రిజెక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ గాక ఫస్ట్ డే మరింత దారుణంగా కలెక్షన్స్ పడిపోవడానికి ఐపీఎల్ లో హైదరాబాద్ మ్యాచ్ జరగడం, అది కూడా హైదరాబాద్ లోనే జరగడం వల్ల తెలుగురాష్ట్రాల ఆడియన్స్ దెబ్బేసారని చెప్పొచ్చు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు