Vishal 2026: రాజకీయాల్లోకి హీరో విశాల్.. క్లారిటీ ఇదే..!

Vishal 2026: తెలుగు , తమిళ ప్రేక్షకులకు హీరో విశాల్ బాగా సుపరిచితులు.. ముఖ్యంగా తెలుగు అబ్బాయి అయినప్పటికీ తమిళంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోగా పేరు సంపాదించారు. తన కెరియర్ లో ఎలాంటి ప్రయోగం చేయడానికి అయినా సిద్ధంగానే ఉంటారు హీరో విశాల్.. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు విశాల్.. ఇలాంటి తరుణంలోనే తనకు క్రేజ్ బాగా పెరగడంతో త్వరలోనే తాను కూడా రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వెల్లడించారు.

Vishal 2026: Hero Vishal enters into Politics..!
Vishal 2026: Hero Vishal enters into Politics..!

రాజకీయాలలోకి విశాల్..
ఇప్పటికే రాజకీయాలకు , సినీ సెలబ్రిటీలకు మంచి అనుబంధం ఉన్నది. ఇలాంటి తరుణంలో హీరో విశాల్ స్వయంగా ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపిస్తానని తెలిపి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇందులో భాగంగానే తాను 2026 లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా పోటీ చేస్తానంటూ వెల్లడించారు హీరో విశాల్. తాజాగా ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న విశాల్ మాట్లాడుతూ.. పొలిటికల్ ఎంట్రీ లో భాగంగా తాను కూడా పార్టీ స్థాపిస్తానని చెప్పిన ఈయన..అంతేకాదు తాజాగా జరిగిన ఒక మీడియా సమావేశంలో చెన్నై వేదికగా ఈ విషయాలను వెల్లడించారు..

అందుకే రాజకీయ పార్టీ..
రాష్ట్రంలోని ప్రజలు సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు.. వారికోసం నేను అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే రాజకీయాలలోకి వస్తున్నాను అంటూ తెలిపారు… ఈ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు కూడా స్పందించారు విశాల్.. ఒకవేళ మీరు ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అని అడగ్గా దానికి విశాల్ సమాధానం ఇస్తూ.. మొదట నన్ను నేను నిరూపించుకుంటాను.. ఆ తర్వాతే పొత్తు గురించి ఆలోచిస్తాను.. ముఖ్యంగా మిగిలిన విషయాలు ప్రజలు నన్ను నమ్మిన తర్వాతే ఆలోచిస్తాను అంటూ తెలిపారు విశాల్.. అంతేకాదు ప్రస్తుతం పొత్తు గురించి ఆలోచనలు ఏమీ లేవని.. ఒకవేళ ఆ సందర్భం వస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి అంటూ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి..

- Advertisement -

విజయ్ కూడా…
ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితమే హీరో విజయ్ కూడా సొంత పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక 2026 ఎన్నికలలో ఆయన బరిలోకి దిగడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. మరొకవైపు ఈయనకు పోటీగా ప్రముఖ స్టార్ హీరోయిన్ నమిత బిజెపి తరఫు నుంచి పోటీ చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఆమె కూడా హీరో విజయ్ కి పోటీగా బరిలోకి దిగుతాను అంటూ కామెంట్ కూడా చేసింది.. ఇలాంటి సమయంలో ఇప్పుడు విశాల్ కూడా పార్టీ పెడతానని చెప్పి రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాడు.. ఇక విజయ్ లాగే సొంత పార్టీ పెడతాను అంటున్న విశాల్ 2026 ఎన్నికలలో ఎవరికి పోటీగా నిలబడతారో చూడాలి.

మొత్తానికైతే ప్రస్తుతం ఇలా సినీ తారలంతా రాజకీయాల్లోకి రావడంతో చివరికి ఏ పార్టీ గెలుస్తుందో కూడా అర్థం కాని పరిస్థితులు తమిళనాడులో ఏర్పడ్డాయి.. మరి ప్రజలు అటు సినీ ప్రముఖులకు ఓటు వేస్తారా లేక సీనియర్ నాయకులను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు