NTR Son’s: సినిమా ఇండస్ట్రీకి దూరంగా.. ఆ వృత్తికి దగ్గరగా..అందుకేనా..?

NTR Son’s.. సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీలు సైతం తమ సినీ వారసులుగా తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. ఈ విషయం పైన అటు అభిమానుల సపోర్టు కూడా చాలానే ఉంటుంది. ఇలా ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు తమ వారసులు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా సినీ వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అలా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉన్నారు.

NTR Son's:Away from the film industry..closer to that profession..is that why..?
NTR Son’s:Away from the film industry..closer to that profession..is that why..?

హరికృష్ణ వారసుడిగా..
హరికృష్ణ కుమారుడిగా, సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడుగా కూడా మొదట ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా జూనియర్ ఎన్టీఆర్ పేరు సంపాదించారు. వరుసగా తన చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఒకపక్క బాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అవుతూ మరింత ఎత్తుకు ఎదుగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి అన్న విషయం తెలిసిందే వీరికి ఇద్దరు కుమారులు..

తన కొడుకులను డాక్టర్లుగా మార్చనున్న ఎన్టీఆర్..
ఇందులో పెద్ద కుమారుడు అభయ్ రామ్ , రెండవ కుమారుడు భార్గవ్ రామ్.. వీరిద్దరి జూనియర్ ఎన్టీఆర్ వారసులు.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వీరిని ఇండస్ట్రీ లోకి తీసుకువస్తారని భావిస్తున్నారు.. కానీ ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ తన కుమారులను సినీ ఇండస్ట్రీ కి దూరంగా ఉంచబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ పిల్లలని బాల నటులుగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ మాత్రం తమ పిల్లలను ఇండస్ట్రీకి దూరం పెడుతున్నారని తెలిసి అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ తన కుమారులను ఇండస్ట్రీకి తీసుకురారని.. ఇద్దరు కుమారులు హీరోలుగా కాకుండా మరో వృత్తిలోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కొడుకులు ఇద్దరినీ కూడా డాక్టర్లు గా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అందుకే వారిని ఇప్పటినుంచి ఆ దిశగానే అడుగులు వేయించేలా జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. లక్ష్మీ ప్రణతి కూడా ఈ విషయాన్ని అంగీకరించడంతో అటు నందమూరి అభిమానులు అయితే కాస్త డీలా పడిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్థానం ఆ తర్వాత తమ కుమారులదే అని భావించిన అభిమానులకు ఈ విషయం కాస్త చేదును మిగులుస్తోంది.

- Advertisement -

అభిప్రాయాలు మారేనా..
మరి నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ తన కుమారులను ఇండస్ట్రీకి దూరం పెడతారా లేకపోతే వారు పెద్దయిన తర్వాత నిర్ణయాన్ని మార్చుకుంటారా అనే విషయం తెలియాల్సి ఉంది.. ముఖ్యంగా ఈ విషయం పైన అటు ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

ఎన్టీఆర్ సినిమాలు:
కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు