Bhairava Dweepam: 30 వసంతాలు పూర్తి చేసుకున్న బాలయ్య “భైరవద్వీపం”

Bhairava Dweepam: విశ్వవిఖ్యాత నటసార్వభౌమా నందమూరి తారక రామారావు నటవారసునిగా, తండ్రికి తగ్గ తనయుడిగా నటసింహ నందమూరి బాలకృష్ణ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఆయా జానర్ లలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. బాలకృష్ణ జానపద, పౌరాణిక చిత్రాల్లో కనిపించి చాలా కాలమే అయ్యింది. ఇక జానపద చిత్రమైతే ఎప్పుడో 1994లో చేశారు. అదే భైరవద్వీపం.

దిగ్గజ దర్శకుడు సింగిీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన భైరవద్వీపం ఆయన కెరీర్ లోనే ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచింది. 1994 ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం గొప్ప విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆర్కే రోజా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. దివంగత నటుడు, రచయిత రావి కొండలరావు ఈ సినిమాకు కధ అందించగా.. చందమామ విజయ కంబైన్స్ బ్యానర్స్ పై బి వెంకటరామిరెడ్డి నిర్మించారు. కైకాల సత్యనారాయణ, విజయ్ కుమార్, కేఆర్ విజయ, సంగీత, రంభ, గిరిబాబు, శుభలేఖ సుధాకర్, బాబు మోహన్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించారు.

ఇక మాధవపెద్ది సురేష్ అందించిన సంగీతం ఈ సినిమా స్థాయిని మరింత పెంచింది. 1994 ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం నేటితో 30 వసంతాలను పూర్తి చేసుకుంది. అంతేకాదు పూర్తిస్థాయి త్రీడీ గ్రాఫిక్స్ తో నిర్మించిన తొలి భారతీయ జానపద చిత్రరాజం బైరవద్వీపం. ఆ కాలంలోనే ఈ చిత్రం ఆంధ్ర, కర్ణాటక, ఒరిస్సా.. ఇలా మూడు రాష్ట్రాలలో శత దినోత్సవం జరుపుకుంది. అంతేకాదు ఈ చిత్రం ఏకంగా తొమ్మిది నంది అవార్డులు గెలుచుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు