Mega Family : బాబాయ్ కోసం అబ్బాయ్ సైతం..

Mega Family : టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ కి ఉండే బాండింగ్ వేరే అన్న సంగతి తెలిసిందే. ఇండియా మొత్తం మీద ఈ ఫ్యామిలీ లో ఉన్న సక్సెస్ ఫుల్ స్టార్స్ ఈ మధ్య కాలంలో లేరనే చెప్పాలి. ఇదే ఫ్యామిలీ (Mega Family) లో సీనియర్స్ తో సహా నలుగురు హీరోలో ఇండస్ట్రీ లో టాప్ పొజిషన్ లో ఉన్నారంటే చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి నాటిన వృక్షం నుండి ఎదిగిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఇప్పుడు తమ తమ సినిమాలు, ఇంకా బిజినెస్ లతో దూసుకుపోతున్నారు. ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పిన చిరు మళ్ళీ సినిమాల బాట పట్టగా, పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇక మరో నెలరోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సినిమాలన్ని పూర్తిగా పక్కనబెట్టి ఎన్నికల ప్రచారం లో ఉన్నాడు. ఇక తాజాగా అన్న మెగాస్టార్ చిరంజీవిని తమ్ముడు పవన్ కళ్యాణ్ కలవగా, పవన్ కళ్యాణ్ పలు రైతులకు చేస్తున్న సేవలకోసం జనసేన పార్టీకి చిరు 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు సోషల్ మీడియాలో తెలియజేస్తూ, కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలో బయటపెట్టగా, తాజాగా మరో విషయాన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది.

బాబాయ్ కోసం అబ్బాయి..

అయితే మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు, జన సేన పార్టీకి 5 కోట్ల భారీ విరాళాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్నీ ఆదివారం నాడు తెనాలిలో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడగా, ఈ మేరకు అన్నయ్య చిరంజీవి ఇచ్చిన భారీ విరాళం తనకు ఎంతో సాయపడగా, త్వరలో రామ్ చరణ్ ఇవ్వనున్న విరాళం గురించి కూడా చెప్పుకొచ్చాడు. తాను అసలు అన్నయ్య ఐదు కోట్ల భారీ విరాళాన్ని ఊహించలేదని అన్నాడు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అన్నయ్య అర్జెంట్‌గా రమ్మని ఫోన్ చేశారు. సినిమా సెట్‌కి వెళ్లాను, ఆంజనేయుడి విగ్రహం ఎదురుగా ఉంది, అన్నయ్య చిరంజీవి ఐదు కోట్ల విరాళాన్ని అందించారు, అసలు ఐదు కోట్ల విరాళాన్ని ఆశించలేదు, ఊహించలేదు.. కౌలు రైతుల కోసం ఎంతో కష్టపడ్డావు.. నీలాంటి వాడు ఖచ్చితంగా నిలబడతాడు అని చెప్పి నాకు విరాళం ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ అన్నాడు.

త్వరలో భారీ విరాళం?

అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆ క్రమంలోనే రామ్ చరణ్‌ గారిని పిలిచి ఆయన్ను కూడా విరాళం ఇవ్వమని అన్నయ్య చెప్పారు అన్నారు. ఇక అదే సమయంలో చరణ్ డాక్టరేట్ గురించి మాట్లాడుతూ, వేల్స్ యూనివర్సిటీ నుంచి రామ్ చరణ్ కి డాక్టరేట్ వచ్చింది, కంగ్రాట్స్.. అంటూ ఇలా పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని సాగించాడు. అంటే రామ్ చరణ్ సైతం ఇక జన సేనకు భారీ విరాళాన్ని ఇవ్వబోతోన్నట్టుగా తెలుస్తోంది. ఇక భారీ మొత్తంలో పవన కళ్యాణ్‌కు రామ్ చరణ్ విరాళంగా ఇస్తాడని అంతా అనుకుంటున్నారు. ఎంతో తెలీదు గాని చిరుని మించి అని తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ చివర్లో గానీ అక్టోబర్‌లో గానీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని రామ్ చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు