Varalakshmi: వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లిపై.. మాజీ ప్రియుడు హాట్ కామెంట్స్..!!

Varalakshmi: కోలీవుడ్ , టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్గా వరలక్ష్మి శరత్ కుమార్ బాగా సుపరిచితమే.. అయితే ఈమె హీరోయిన్ గా కంటే విలన్ గానే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఎవరో కాదు తమిళ నటుడు శరత్ కుమార్ కూతురే. ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. సడన్ గా పెళ్లి విషయాన్ని తెలియజేసి అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. నటిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వరలక్ష్మి హీరోయిన్ గా కంటే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రలలో నటిస్తోంది.

Varalakshmi:Varalakshmi Sarathkumar's wedding.. Hot comments from ex-boyfriend..!!
Varalakshmi:Varalakshmi Sarathkumar’s wedding.. Hot comments from ex-boyfriend..!!

వరలక్ష్మి తో బ్రేకప్ పై విశాల్ క్లారిటీ..

ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఉందంటే కచ్చితంగా ఆ సినిమా హిట్ అనే పేరు సంపాదించుకుంది. గతంలో వరలక్ష్మి తమిళ హీరో విశాల్ తో ప్రేమలో ఉందనే ప్రచారం బాగా వినిపించింది. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే రూమర్ కూడా వినిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పటివరకు విశాల్ వివాహం కూడా చేసుకోలేదనే టాక్ అయితే కోలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. ఇటీవలే విశాల్ నటించిన రత్నం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ లో పాల్గొన్నప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం గురించి ప్రశ్న ఎదురయింది.

వరలక్ష్మి పై విశాల్ పాజిటివ్ కామెంట్స్..

ఈ విషయం పైన విశాల్ స్పందిస్తూ.. తమిళంతోపాటు తెలుగులో కూడా ఆమె దూసుకుపోతోంది. సినిమాల పరంగా వరలక్ష్మికి మంచి మార్కెట్ ఉందని కూడా తెలిపారు విశాల్.. హనుమాన్ చిత్రంలో చాలా మెస్మరైజింగ్ పాత్రలో కనిపించింది. అంతేకాకుండా అతి తక్కువ సమయంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ విశాల్ తెలియజేశారు.. ఇప్పుడు ఏకంగా ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెడుతున్నందుకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు విశాల్. విశాల్ కూడా తెలుగు, తమిళ మార్కెట్లో మంచి క్రేజ్ అందుకున్నారు.

- Advertisement -

రత్నం సినిమా విశేషాలు ఇవే..

విశాల్ సినిమా కోసం ఎలాంటి ప్రయోగాలు చేయడానికి అయినా.. రిస్క్ చేయడానికి అయినా సిద్ధంగానే ఉంటారు.రత్నం సినిమాలో విశాల్ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నది… ఏప్రిల్ 26న ఈ చిత్రం థియేటర్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తూ ఉండడంతో ఈ సినిమాకి మరింత ప్లేస్ కాబోతోంది.

వరలక్ష్మి సినిమాలు..

ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నది. మలయాళం లో కూడా పలు సినిమాలతో బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకోండి ఈ ముద్దుగుమ్మ. విశాల్ తో ప్రేమ బ్రేకప్ తర్వాత ప్రముఖ ఆర్టిస్ట్ నికోలామ్ తో ప్రేమలో పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాదే వివాహం కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్. వరలక్ష్మి శరత్ కుమార్ పైన విషయాలు చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. విశాల్ అభిమానులు కూడా తాను కూడా వివాహం చేసుకోమంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు