Rajasaab : సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ!

Rajasaab : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో షూటింగ్ లలో బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కల్కి 2898AD పైనే ఉన్నా, కుదిరినప్పుడల్లా రాజా సాబ్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇక గత రెండేళ్లుగా ప్లాప్ లతో సతమతమైన ప్రభాస్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో సలార్ తో తన సత్తా చూపించాడు ప్రభాస్. ఆ సినిమా ఓ మోస్తరు కంటెంట్ ఉన్నా, ప్రభాస్ కటౌట్ కి తగ్గ రేంజ్ ఎలివేషన్లతో ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఇక కొన్నేళ్లుగా డీలా పడ్డ డార్లింగ్ ఫ్యాన్స్ కూడా సలార్ తో కొత్త జోష్ వచ్చింది. ఇక ప్రభాస్ చేస్తున్న కల్కి షూటింగ్ ఆల్మోస్ట్ 90 శాతం పూర్తవగా, టెక్నికల్ టీం తో గ్రాఫిక్స్ కి సంబంచిందిన వర్క్ నడుస్తుంది. ఈ క్రమంలో రాజా సాబ్ షూటింగ్ ఖాళీ సమయాల్లో జరుగుతూ ఉంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్మోస్ట్ సగానికి పైగా పూర్తయిందట.

ప్రభాస్ లేకుండా కూడా..

ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్(Rajasaab) సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యి ఏడాదిన్నర పైనే అయింది. అప్పుడప్పుడూ షూటింగ్ కి సంబంధించిన స్టిల్స్ కూడా లీక్ అయ్యాయి. ఇక రాజా సాబ్ మూవీ ని దర్శకుడు మారుతీ చాలా పగడ్బందీగా షూట్ చేస్తున్నాడు. ఈ సినిమాని తన స్టైల్ లో ఒక నార్మల్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నానని మారుతీ ఇంతకు ముందే చెప్పడం జరిగింది. కానీ ప్రభాస్ లో చాలా ఏళ్లుగా మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ ని మాత్రం ఫ్యాన్స్ కి పక్కా గా అందిస్తానని మారుతీ పలు ఇంటర్వూ లలో చెప్పడం జరిగింది. ఇక ప్రభాస్ లేనప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఆపకుండా మారుతి మిగతా కీలక సన్నివేశాలని షూటింగ్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ నటిస్తున్న కల్కి రిలీజ్ అయితే మొత్తం ఫోకస్ ఈ సినిమా పైనే ఉంటుందని చెప్పవచ్చు.

షూటింగ్ లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ!

ఇక ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ లో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా, ఇప్పటికే మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ సెట్స్ లోకి అడుగుపెట్టగా, తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా సెట్స్ లో జాయిన్ అయిందని సమాచారం. నిధి పై కొన్ని కీలక సన్నివేశాలని మారుతీ షూట్ చేయబోతున్నారట. ఇక రాజా సాబ్ లో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అది ప్రభాస్ కి జోడిగా నా లేక సినిమాలో మరేదైనా కీ రోల్ అయి ఉంటుందా అనేది తెలియాల్సింది. ఇక రాజా సాబ్ లో జిష్షు సేన్ గుప్త, యోగి బాబు, బ్రహ్మానందం, సప్తగిరి కూడా నటిస్తున్నారు. ఇక రాజా సాబ్ సినిమా కల్కి రిలీజ్ డేట్ ని బట్టి వస్తే ఈ ఇయర్ దీపావళి కి లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు