Raghava Lawrence : ఒకే ఏడాది హ్యాట్రిక్స్ లైన్లో పెట్టాడు!

Raghava Lawrence : సౌత్ ఇండస్ట్రీ లో టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభుదేవా దగ్గర శిష్యరికం చేసి, డాన్స్ మాస్టర్ గా సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ల ప్రొత్సహం తో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు. సౌత్ ఇండియా లో అందరు స్టార్ హీరోల సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పని చేసిన లారెన్స్ ఆ తర్వాత దర్శకుడిగా మారి తన ప్రతిభను చాటుకున్నాడు. ఇక అలాగే హీరోగానూ సౌత్ ఇండియాలో చెరగని ముద్ర వేసాడు రాఘవ లారెన్స్. ముని, కాంచన వంటి తన హర్రర్ మూవీ ఫ్రాంచైజెస్ తో పాటు, పలు మాస్ మసాల ఓరియెంటెడ్ చిత్రాల్లో హీరోగా నటిస్తూ బిజీ గా ఉన్నాడు రాఘవ లారెన్స్. ఇక డాన్స్ మాస్టర్ గా, న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా ప్ర‌తిభ చాటుకుంటున్న బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి రాఘ‌వ లారెన్స్, ఇప్పటికీ తాను మూడు ఫీల్డ్ లలోనూ రాణిస్తున్నాడు. కాకపోతే కొన్నేళ్ల నుంచి అత‌ను ద‌ర్శ‌క‌త్వానికి దూరంగా ఉంటూ హీరోగానే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు.

ఈ ఇయర్ మూడు సినిమాలు..

ఇక గ‌త ఏడాది లారెన్స్(Raghava Lawrence) నుంచి వ‌చ్చిన జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్ మూవీ న‌టుడిగా అత‌డి కెరీర్లో వన్ అఫ్ ది బెస్ట్ ఫిలింగా నిలిచింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఓ మోస్త‌రుగా ఆడిన ఈ చిత్రంలో పలు వెరియేషన్లు చూపించాడు లారెన్స్. ఇక ఈ సినిమా త‌ర్వాత చాలా క‌థ‌లు విన్నా త‌న‌కు అంత కిక్ ఇవ్వ‌లేదంటూ కొత్త సినిమాలే ఒప్పుకోలేదు లారెన్స్. ఐతే ఇప్ప‌డు అత‌ను ఒకేసారి ఏకంగా మూడు సినిమాలు ఓకే చేయ‌డం విశేషం. అందులో రెండు హీరోగా న‌టించ‌బోయేవి కాగా.. ఇంకోటి తాను ఎప్ప‌ట్నుంచో భాగం కావాల‌నుకున్న డ్రీమ్ కాంబినేష‌న్లో రాబోతున్న సినిమా. లారెన్స్ హీరోగా హంట‌ర్ అనే కొత్త సినిమా అనౌన్స్ అయింది. వెంక‌ట్ మోహ‌న్ అనే ద‌ర్శ‌కుడు రూపొందిస్తున్న ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. లారెన్స్ కెరీర్లోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్కనుందట. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్ట‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

తలైవా తో?

ఇక లారెన్స్ హంటర్ సినిమా తో పాటు ‘బెంజ్’ అనే మ‌రో సినిమాలోనూ హీరోగా న‌టిస్తున్నాడు లారెన్స్. ఈ చిత్రం లోకేష్ క‌న‌క‌రాజ్ నిర్మాణంలో లోకి అందించబోయే క‌థ‌తో తెర‌కెక్క‌నుండ‌డం విశేషం. ఓ కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నాడు. దీని అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ కూడా ఇంట్రస్టింగ్ గా ఉంది. మ‌రోవైపు లారెన్స్ ఎప్ప‌ట్నుంచో క‌ల‌లు కంటున్న ర‌జినీ సినిమా అవ‌కాశం కూడా అత‌డి చేతికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. రజినీకాంత్ హీరోగా లోకేష్ క‌న‌క‌రాజ్ దర్శకత్వం లో రూపొందించ‌బోయే కొత్త చిత్రంలో లారెన్స్ ప్ర‌త్యేక పాత్ర చేయ‌నున్నాడ‌ట‌. మొత్తంగా ఈ ఇయర్ లారెన్స్ కొత్త సినిమాల లైన‌ప్ చాలా ఎగ్జైటింగ్‌గా క‌నిపిస్తోంది. ఒకే ఏడాది మూడు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు