Kanguva : ఆ ఒక్క పోస్టర్ తో మన సినిమాకి లింకెట్టేసారు!

Kanguva : కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న కంగువ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాతో భారీ పాన్ ఇండియా విజ‌యంపై క‌న్నేశాడు సూర్య. ఇక వేదాళం దర్శకుడు శివ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇతను తెలుగులో కూడా శౌర్యం, శంఖం, దరువు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇక కంగువ సినిమాని స్టూడియోగ్రీన్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా 200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక కంగువ ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని టీజర్ తో సూర్య అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులలో కూడా ప్రకంపనలు సృష్టించింది. చిత్ర పరిశ్రమ వ‌ర్గాలు స‌హా, కామన్ ఆడియన్స్ అందరూ దీని గురించి చ‌ర్చించుకునేలా చేసింది. ఇక ఈ సినిమాలో సూర్య ఒక తెగకు చెందిన వారియర్‌గా, బాబీ డియోల్ మరో తెగకు చెందిన విల‌న్‌గా కనిపించడం ఉత్కంఠను పెంచింది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ దగ్గరవుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు పెరిగిపోతుండగా, తాజాగా రిలీజ్ చేసిన ఓ పోస్టర్ మాత్రం జనాలకి పలు విధాలుగా డౌట్లు తెచ్చి పెడుతుంది.

పోస్టర్ తో హైపెక్కిస్తూ.. డౌట్స్ కూడా..

ఇక జ‌నంలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న క్యూరియాసిటీని మ‌రింత‌ పెంచడానికి మేకర్స్ తమిళ నూతన సంవత్సరం సందర్భంగా కంగువ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసారు. అయితే ఈ పోస్టర్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు ఏ విధంగా పెరిగాయో, మరిన్ని అనుమానాల్ని కలిగిస్తుంది. ఆడియన్స్ కి లేని పోనీ డౌట్లు వస్తున్నాయి. ఇక సూర్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో చేస్తున్న కంగువ (Kanguva) మూవీ నుండి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ సినిమా మీద ఉన్న హైప్ మరో లెవల్ కి వెళ్ళేలా చేసాయి అని చెప్పాలి. ఇక ఈ సినిమా నుండి వచ్చిన కొత్త పోస్టర్ లో సినిమా 2024 ఇయర్ లోనే ఆడియన్స్ ముందుకు రాబోతుందని కన్ఫాం చేయగా, సినిమా ఓవరాల్ బ్యాక్ డ్రాప్ ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. ఇక ఆ మధ్య మేకర్స్ ఒక ఇంటర్వ్యూలో సినిమా కథ బేస్ గోవాలో జరుగుతుందని, ప్రజెంట్ జనరేషన్ కథకి, గ్లిమ్స్ లో చూపించిన కథకి ఉన్న లింక్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని చెప్పారట.

ఈ తెలుగు సినిమా కాన్సెప్ట్ లా!

ఇక తాజాగా రిలీజ్ చేసియాన్ పోస్టర్ ని గమనిస్తే రెండేళ్ల కింద తెలుగులో వచ్చిన బింబిసార గుర్తుకు వస్తుంది. ఇక మేకర్స్ చెప్పిన స్టోరీ పాయింట్ మాట విన్న తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార స్టోరీ పాయింట్ లాగే ఈ కథ కూడా ఉండబోతుందని నెటిజన్లు భావిస్తున్నారు. మేకర్స్ చెప్పిన మాటలను బట్టి బింబిసార లానే ఆ టైం లో ఉండే ఒక క్రూరమైన రాజు, ఇప్పటి టైంకి వస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో కంగువ ఉండబోతుందని, అందుకే ఈ సినిమా రెండు పార్టులుగా కూడా ఉండే అవకాశం ఉందని, మొదటి పార్ట్ సక్సెస్ ను బట్టి ఇతర పార్టులపై అనౌన్స్ మెంట్ ఉంటుందని అన్నారు. మరి బింబిసారలానే కంగువ కథ ఉంటుందో లేదో తెలీదు గాని, దర్శకుడు శివ సినిమాల ట్రాక్ రికార్డు చూస్తే, కథ పరంగా అన్ని రొటీన్ సినిమాలే ఉంటాయి. కానీ స్క్రీన్ ప్లే పరంగానే మ్యాజిక్ చేస్తాడు. మరి కంగువ కథ తో ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తారో చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు