WhistlePodu Song : యువన్ ని ట్రోల్ చేస్తున్న విజయ్ ఫ్యాన్స్.. ఇంత కక్కుర్తి ఏంటి!

WhistlePodu Song : ఇక సౌత్ ఇండియన్ స్టార్ హీరోలలో ముఖ్యంగా తమిళ నాట స్టార్ హీరో దళపతి విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ తలపతి త్వరలో పాలిటిక్స్ లో బిజీ అవ్వబోతుండగా, ఆల్మోస్ట్ చివరి సినిమా అంటూ ఈ హీరో నుండి లేటెస్ట్ మూవీ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ (GOAT Movie) తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీ నుండి తాజాగా మొన్న ఫస్ట్ సాంగ్ విజిల్ పోడు (WhistlePodu Song) రిలీజ్ అవ్వగా భారీ వ్యూస్ తో దుమ్ము లేపిందని చెప్పాలి. అయితే విజయ్ రీసెంట్ సినిమాల పాటలతో పోల్చితే ఈ పాటకి యునానిమాస్ రెస్పాన్స్ ఏమి రాలేదు కానీ, ఉన్నంతలో పాటకి రెస్పాన్స్ పర్వాలేదు అనిపించేలా వచ్చింది. కానీ యూట్యూబ్ లో రికార్డుల పరంగా మాత్రం విజయ్ ఫ్యాన్స్ వదలట్లేదు. కాగా ఈ పాట విజయ్ కెరీర్ లో మరో 1 మిలియన్ లైక్స్ మార్క్ ని 24 గంటల లోపే అందుకోగా, ఓవరాల్ గా విజయ్ కెరీర్ లో ఇది ఎనిమిదవది. ఇక ఈ సాంగ్ 24 గంటల్లో 24.88 మిలియన్ల వ్యూస్ ని అందుకుని సౌత్ లో అల్ టైం హైయెస్ట్ వ్యూస్ సాధించిన సాంగ్ గా రికార్డు నెలకొల్పింది. అయితే ఇంత జరిగినా కూడా విజయ్ ఫ్యాన్స్ సంతృప్తి పడలేదు.

అతడ్ని అడ్డం పెట్టుకుని యువన్ ని ట్రోల్..

అయితే గత కొంత కాలంగా విజయ్ కి సంబంధించిన పాటలు గాని, ముఖ్యనగ ఇంట్రో సాంగ్స్ అదిరిపోయే రేంజ్ లో వస్తున్నాయి. విజయ్ గత చిత్రాలకు ఈ మధ్య కాలంలో అనిరుద్ ఎక్కువగా సంగీతం అందించాడన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విజిల్ పొడు సాంగ్ కి ఆ రేంజ్ లో రెస్పాన్స్ రావడం లేదని, తాము సంతృప్తి పడేంత ఇవ్వలేదని ఏకంగా, మ్యూజిక్ డైరెక్టర్ ని ట్రోల్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. అయితే యువన్ తన వరకు చేయాల్సింది చేసాడు. పాటకి చేయాల్సిన న్యాయం చేసాడు. కానీ అనిరుధ్ తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అన్ని సార్లు అనుకున్న విధంగా సాంగ్స్ రావు. ప్రతి పాట కూడా అంతకు మించి ఉండాలి అంటే ఎలా అని కొందరు అంటున్నారు. కాని ఇది విజయ్ ఫ్యాన్స్ ఎప్పుడు అర్ధం చేసుకుంటారో.

మరీ ఇంత కక్కుర్తి పనికిరాదు?

అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ పాటకి ఆడియన్స్ నుండి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు, రీసెంట్ టైంలో వచ్చిన విజయ్ సినిమాల పాటలతో పోల్చితే విజిల్ పోడు (WhistlePodu Song)సాంగ్ యావరేజ్ గా ఉంది. కాని విజయ్ ఫ్యాన్స్ మరీ ఇంత కక్కుర్తి పడకూడదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సాంగ్ బెస్ట్ గా రావాలంటే అది కుదరదు. అది మూవీ కంటెంట్ ని బట్టి, సందర్భాన్ని బట్టి, అప్పటికప్పుడు అనూహ్యంగా కూడా మంచి కంటెంట్ మ్యూజిక్ రావచ్చు. అలాగని ఇలా మ్యూజిక్ డైరెక్టర్ ని ట్రోల్ చేస్తే ఎలా అని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ వరకు చూసుకుంటే ఈ సోషల్ మీడియా రచ్చ కొంత వరకు బెటర్ అని చెప్పాలి. మరి ఈ సినిమా నుండి రాబోయే సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు