Rathnam : అదే రుద్దుడు.. అదే ఉతుకుడు.. మహేష్ సినిమా గుర్తుకుతెచ్చాడుగా!

Rathnam : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ మార్క్ ఆంటోనీ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. అంతే కాదు మొదటి సారిగా 100 కోట్ల క్లబ్ లో ఆ సినిమాతో అడుగుపెట్టాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలు లైన్లో పెట్టిన విశాల్ తమిళ స్టార్ డైరెక్టర్ హరి
సినిమాతో ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విశాల్ 34వ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా విశాల్ హరి కాంబో లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఇంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన భరణి, పూజ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు మూడో సినిమాగా రత్నం పేరుతో మాస్ కమెర్షియల్ ఆక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి క్రేజీ అంచనాలను క్రియేట్ చేసాయి. తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేయగా, డైరెక్టర్ హరి సినిమాల రెగ్యులర్ ఫార్మాట్ లోనే ఫుల్ మాస్ స్టఫ్ తో ట్రైలర్ ని యాక్షన్ ఎమోషనల్ కట్స్ తో నింపేశారు. అయితే ట్రైలర్ ఆశించినంత రేంజ్ లో లేదన్నమాట వాస్తవం.

అదే రుద్దుడు అదే ఉతుకుడు..

ఇక విశాల్ రత్నం సినిమా లో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడని కొందరు అంటుండగా, అఫీషియల్ గా మేకర్స్ మాత్రం ప్రకటించలేదు. అయితే రత్నం సినిమా హరి గత సినిమాల్లా పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కుతోందని తెలిసిపోతుంది. ఇక తమిళ్ లో స్పీడ్ స్క్రీన్ ప్లే తో సినిమాలు చేస్తాడు అన్న పేరున్న హరి ఈ సినిమాను కూడా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నంలో సింపుల్ గా కథ రాసుకున్నాడని తెలుస్తుంది. ట్రైలర్ లో రెండు ఊర్ల మధ్య గొడవ, ఒక అమ్మాయిని కాపాడుతూ హీరో ఏం చేశాడు, ఆ మధ్యలో హీరో,హీరోయిన్ల మధ్య సైలెంట్ లవ్ ట్రాక్, ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా లో చూడాలి అంటూ ఒక్క ముక్కలో ట్రైలర్ లో కథ ని చెప్పినట్టయింది. అయితే దీనికి తగ్గట్టు హరి మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకుంటే ఒకే. కానీ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేటట్టు అదే రుద్దుడు, అదే ఉతుకుడు అయితే కష్టమే.

బాబు సినిమా ని గుర్తు చేసారు..

ఇక విశాల్ రత్నం ట్రైలర్ ని ఒక్కసారి గమనిస్తే ట్రైలర్ చూసిన తర్వాత తెలుగు మూవీ లవర్స్ కి మాత్రం 20ఏళ్ళ కింద తెలుగు లో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా ఎక్కువగా గుర్తుకు వచ్చింది అని చెప్పాలి. ఆ సినిమా మొత్తం విలన్ నుండి హీరోయిన్ ని కాపాడడంతోనే కథ ఉంటుంది. అలా క్లైమాక్స్ కి దగ్గరవుతుంటే వీళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇక రత్నం ట్రైలర్ లో కూడా మొత్తం హీరో, హీరోయిన్ తో పారిపోవడం, వీళ్ళ వెంట విలన్స్ పడటం, ఇదే రిపీట్ అయింది. దీనికి ఊరి గొడవల్ని లింక్ చేసారు అంతే. ఇక రత్నం ట్రైలర్ కే దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. మొత్తం మీద హరి సినిమాలు అంటే యాక్షన్ పార్ట్ బాగానే వర్కౌట్ అవుతుంది. ఏది ఏమైనా
రీసెంట్ గా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విశాల్ చేస్తున్న కొత్త సినిమా అవ్వడంతో మాస్ లో మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఇక కోలీవుడ్ నుండి మంచి క్రేజ్ మార్కెట్ ఉన్న హీరోల్లో విశాల్ కూడా ఒకరు. ఈ సమ్మర్ లో తెలుగులో కూడా పెద్దగా సినిమాలు పోటీలో లేవు కాబట్టి, మంచి టాక్ తెచ్చుకుంటే విశాల్ రత్నం మంచి హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు