Apoorva Srinivasan : సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన టాలీవుడ్ నటి.. ఫొటోస్ వైరల్..!!

Apoorva Srinivasan.. సినీ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఎప్పుడు? ఎవరిని? ఎలా ?వివాహం చేసుకుంటారో చెప్పడం అసాధ్యం.. ఒకసారి డేటింగ్ అంటూ మీడియా కంటపడతారు. మరొకసారి ఏకంగా పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరుస్తారు. అయితే కొంతమంది అందరికీ తెలిసేలా చాలా ఘనంగా వివాహం చేసుకుంటే మరి కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకొని ఆ తర్వాత అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు.. అలాంటి వారిలో ఇప్పుడు అపూర్వ శ్రీనివాసన్ కూడా ఒకరు.. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు ఈ క్రమంలోని టాలీవుడ్ ప్రముఖ నటి అపూర్వ శ్రీనివాసన్ కూడా వైవాహిక బంధం లోకి అడుగు పెట్టింది.

Apoorva Srinivasan:Tollywood actress marrying secretly.. Photos viral..!!
Apoorva Srinivasan:Tollywood actress marrying secretly.. Photos viral..!!

రహస్యంగా అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి..

శ్రేయాస్ శివకుమార్ అనే వ్యక్తితో ఈమె 7 అడుగులు వేసింది.. గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీలో కనిపించని అపూర్వ శ్రీనివాసన్ సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్ కూడా అపూర్వ శ్రీనివాసన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ సందర్భంగా అపూర్వ మెడలో మూడు ముళ్ళు వేసిన తర్వాత భార్యను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు శ్రేయాస్ శివకుమార్. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్ స్టా గ్రామ్ వేదికగా వైరల్ అవుతున్నాయి.

అపూర్వ శ్రీనివాసన్ సినిమాలు..

ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రంలో అత్యాచారానికి గురైన అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది అపూర్వ శ్రీనివాసన్. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి, తొలిప్రేమ, ప్రేమ కథా చిత్రం 2 ,ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాలలో పలు పాత్రలు పోషించిన ఈమె చివరిగా 2022లో నీతో అనే సినిమా చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది.. ఇక తాజాగా పెళ్లి చేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వీరి పెళ్లికి సిమ్రాన్ చౌదరి మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.

- Advertisement -

అపూర్వ శ్రీనివాసన్ ప్రేమ వివాహం..

గత కొన్ని సంవత్సరాలుగా శ్రేయోస్ శివకుమార్ అనే వ్యక్తితో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. ఎక్కడా కూడా మీడియా కంట పడకుండా జాగ్రత్త పడింది. అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలలో నటించడంతో పెద్దగా ఎవరు ఈమెను గుర్తించలేదు.. అదే ఈమెకు బాగా కలిసొచ్చింది అని చెప్పాలి.. అయితే ఇప్పుడు ఎట్టకేలకు తాను ప్రేమించిన వ్యక్తితో ఏడడుగులు వేయడంతో అది చూసిన అభిమానులు సైతం ఇంత రహస్యంగా ఎందుకు వివాహం చేసుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే తన పెళ్లితో అందరినీ ఆశ్చర్యపరిచిన అపూర్వ శ్రీనివాసన్..వివాహం జరిగింది కాబట్టి మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుందా? లేక వైవాహిక జీవితానికి పరిమితమవుతుందా? అన్నది తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా అపూర్వ వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచిందనైతే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు