Harish Shankar : తమ్ముడి గ్యారెంటీ లేదు.. ఈలోపు అన్నయ్యతో..

Harish Shankar : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. ఈయన చేసే సినిమాల్లో ఎప్పుడూ హీరోలకి ఒక డిఫరెంట్ వేరియషన్స్ చూపిస్తాడు హరీష్. ముఖ్యంగా ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లలో వాళ్ళ ఇమేజ్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఫ్యాన్స్ సంతృప్తి పడేలా సినిమా తీసే దర్శకుల్లో హరీష్ ఒకరు. ఇక నాలుగేళ్ళ కింద గద్దల కొండ గణేష్ తో హిట్టు కొట్టిన హరీష్ ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. అయితే అంతకు ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ పవన్ ఎన్నికల హడావిడి కారణంగా రవితేజ తో సినిమా చేస్తున్నాడు. ఓ బాలీవుడ్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కుతుంది రవితేజ సినిమా. ఇక అల్రెడీ మిస్టర్ బచ్చన్ షూటింగ్ సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తర్వాత హరీష్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా సెట్ చేస్తున్నాడట.

తమ్ముడు లేట్.. అందుకే అన్నయ్య తో..

అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం హరీష్ శంకర్ (Harish Shankar) ఆల్రెడీ చిరు కి కథ వినిపించడం, స్టోరీ ఒకే చేయడం కూడా జరిగిందట. ఇక హరీష్ తో సినిమా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక చిరు హరీష్ కాంబోలో రాబోయే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుందని సమాచారం. ఇక ఈ సినిమా కూడా హరీష్ మార్క్ స్టైల్లో సినిమా ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని టాక్. అయితే చిరు విశ్వంభర సినిమా పూర్తి కావడమే ఆలస్యం, హరీష్ శంకర్ చిరు సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. ఇక రవితేజ తో మిస్టర్ బచ్చన్ మే లోపే పూర్తవుతుందట. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ను చిన్నగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. కానీ పవన్ డేట్లు అసలు కుదరడమే లేదు. అందుకే తమ్ముడు పవన్ సినిమాను పక్కన పెట్టి అన్నయ్య చిరుతో హరీష్ శంకర్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో చిరు సినిమా అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ కి ఎంటర్టైనర్ మీల్స్ గ్యారెంటీ అని ట్రేడ్ విశ్లేషకులు సైతం అంటున్నారు.

ఇప్పట్లో హరీష్ కి ఛాన్స్ లేదు?

అయితే నిజానికి మిస్టర్ బచ్చన్ పూర్తయ్యాక పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఎన్నికల వల్ల జూన్ వరకు బిజీ. ఆ తర్వాత ఫ్రీ అయినా ముందుగా హరి హర వీరమల్లు, OG సినిమాలను పూర్తి చేస్తాడు. ఫ్యాన్స్ కూడా ముందుగా ఆ సినిమాల గురించే వెయిట్ చేస్తున్నారు. వీటి తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఈ ఇయర్ మొత్తం పోయినట్టే. అందుకే చిరుతో హరీష్ శంకర్ చేసే స్టోరీ లాక్ చేసి ఇయర్ ఎండింగ్ లో సెట్స్ పైకి తీసుకువెళ్తున్నాడు. అయితే హరీష్ శంకర్ ఎక్కువగా రీమేక్ సినిమాలనే చేస్తుంటాడు. మరి చిరుతో కూడా మళ్ళీ రీమేక్ చేస్తాడా లేదా ఒరిజినల్ సబ్జెక్ట్ అయి ఉంటుందా అన్నది తెలియాలి. ఎందుకంటే చిరు రీమేక్ లతో ఇచ్చిన షాకుల వల్ల మెగా ఫ్యాన్స్ మాత్రం హరీష్ శంకర్ ఒరిజినల్ కథతోనే చేయాలని కోరుకుంటున్నారు. అయితే చిరు విశ్వంభర సినిమా పూర్తయ్యాకే ఈ సినిమా ఉంటుందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు