OTT : ఓటీటీ ని ఊపేస్తున్న హార్రర్ – సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..!

OTT.. గత నాలుగు సంవత్సరాల క్రితం కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు థియేటర్లలో సినిమా చూడడం కంటే .. ఇంట్లో కూర్చుని ఓటీటీ లో వచ్చే సినిమాలు వెబ్ సిరీస్ లను చూస్తూ కుటుంబంతో చిల్ అవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఓటీటీ వారి వినోదానికి వేదిక అయింది. ఈ నేపథ్యంలోనే వినూత్నమైన కథలతో , అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు.. ప్రస్తుతం కామెడీ సినిమాలే కాదు కుటుంబ కథా చిత్రాలు, హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఆడియన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి ఓటు వేస్తున్న నేపథ్యంలో అలాంటి చిత్రాలు, వెబ్ సిరీస్ ల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వెబ్ సిరీస్ ని మాత్రం అస్సలు మిస్ కావొద్దు. అదే “లైవ్ టెలికాస్ట్”..

OTT : Best horror - suspense thriller movie in OTT..!
OTT : Best horror – suspense thriller movie in OTT..!

ఓటీటీని వణికిస్తున్న లైవ్ టెలికాస్ట్..

భయం , ఉత్కంఠ , థ్రిల్ వంటి అంశాలతో నిండిన లైవ్ టెలికాస్ట్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మొత్తం ఏడు భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈభయానక వెబ్ సిరీస్ ని చూడాలంటే కొంచెం గుండె ధైర్యం ఉండాల్సిందే. 2021లో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ లైవ్ టెలికాస్ట్ ఒక్కసారి చూస్తే ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పవచ్చు.. ఇందులో ఆనంది , యోగి బాబు కూడా కీలక పాత్రలు పోషించారు.. లైవ్ టెలికాస్ట్ వెబ్ సిరీస్ లో జెన్నిఫర్ మాథ్యూ పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించింది..

లైవ్ టెలికాస్ట్ సినిమా కథ..

టిఆర్పి రేటింగ్ కోసం ఏదైనా చేయగల దర్శకురాలిగా ఆమె ఇందులో కనిపించడం విశేషం.. జెన్నిఫర్ మ్యాథ్యూ హంటెడ్ హౌస్ లో చిక్కుకుపోతుంది . ప్రారంభంలో ఆమె చాలా ఉత్సాహంగా ఉంటుంది.. కానీ క్రమంగా ఆమె పరిస్థితి క్షీణించడం ప్రారంభం అవుతుంది..ఇలా ఒక గ్రామంలోని హంటెడ్ హౌస్ లో చిక్కుకోవడం వల్ల టీవీలో తనకు విపరీతమైన పాపులారిటీ లభిస్తుంది. ఈ కాన్సెప్ట్ ను దృష్టిలో పెట్టుకొని తన షో కి లైవ్ టెలికాస్ట్ అని పేరు కూడా పెట్టారు.. హంటెడ్ హౌస్ కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న కాజల్ నిజంగా సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు భయంతో ఆమె పరిస్థితి మరింత దిగజారిపోతుంది.. ఈ భయానక సమయంలో ఆమెను చూసి స్క్రీన్ కు అవతలి వైపు కూర్చున్న ప్రేక్షకులకు కూడా చెమటలు పట్టడం ప్రారంభమవుతాయి..

- Advertisement -

గూస్ బంప్స్ గ్యారంటీ…

ఇక్కడ 2021 లో విడుదలైన ఈ సీరీస్ లో మొత్తం ఏడు ఎపిసోడ్లు ఉన్నాయి.. అన్ని ఎపిసోడ్లు కూడా ఒకదానికంటే మరొకటి చాలా మెరుగ్గా ఆడియన్స్ లో ఉత్కంఠ కలిగించే విధంగా ఉన్నాయి. కాజల్ అగర్వాల్ యొక్క ఈ సీరీస్ చూసే కొద్దీ మరింత ఆసక్తికరంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది.. ముఖ్యంగా భయం ఉత్కంఠ థ్రిల్ వంటి అంశాలతో ఈ సిరీస్ గూస్ బంప్స్ తెప్పిస్తుందనటంలో సందేహం లేదు.. ముఖ్యంగా ఈ భయానక వెబ్ సిరీస్ చూడాలంటే మీకు కూడా గుండె ధైర్యం ఉండాల్సిందే.. మొత్తానికి అయితే కాజల్ అగర్వాల్ ఇందులో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు