The GreatestOfAllTime : దళపతి తో కెప్టెన్ క్యామియో.. కంఫర్మ్ చేసిన ప్రేమలత..

The GreatestOfAllTime : కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హీరోగా ‘ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం’ పేరుతో సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇక లియో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత విజయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా విజయ్ చివరి చిత్రమని ఈ సినిమా తర్వాత రాజకీయాల్లో బిజీ అవుతాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ కూడా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలో తప్ప వేరే ఏ చిత్రంలోనూ నటించట్లేదనేదైతే తెలుసు. ఇక వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో మంచి క్రేజ్ తెచ్చుకోగా, తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ తో మూవీ పై మరింత అంచనాలను పెంచేసింది. ఇక ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది ఆ సాంగ్. ఇక ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 5న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి లేటెస్ట్ గా అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

కెప్టెన్ క్యామియో కంఫర్మ్- ప్రేమలత విజయకాంత్..

ఇక విజయ్ తలపతి విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం సినిమా గురించి ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ కెప్టెన్ విజయ్ కాంత్ స్పెషల్ క్యామియో రోల్ చేస్తున్నారని కంఫర్మ్ అయింది. లాస్ట్ ఇయర్ ఆరోగ్య కారణాల వల్ల ఆయన చనిపోయారు కదా? మరి సినిమాలో ఎలా నటిస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఇది సాధ్యమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం (The GreatestOfAllTime) లో అతిధి పాత్రలో నటించనున్నారు కెప్టెన్ విజయకాంత్. ఈ విషయాన్నీ ఆయన భార్య ప్రేమలత విజయకాంత్ కన్ఫర్మ్ చేసారు. ఈ సందర్బంగా ఆమె విజయ్ సినిమా గురించి ప్రస్తావిస్తూ, కెప్టెన్ విజయకాంత్ AI అనుమతి కోసం వెంకట్ ప్రభు తనని చాలా సార్లు కలిశారని, ఎన్నికల తర్వాత తలపతి విజయ్ కూడా AI అనుమతి కోసం తనని కలవబోతున్నట్టు అన్నారు. ఇక తన భర్త కెప్టెన్ అక్కడ ఉంటే అతను ఖచ్చితంగా అంగీకరించవచ్చు, కాబట్టి ఎన్నికల తర్వాత తాను వారికి సానుకూలంగా తెలియచేస్తానని కన్ఫర్మేషన్ ఇచ్చారు.

ఇంతకు ముందే ఈ టెక్నాలజీ వాడారు..

అయితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో ఆల్రెడీ కన్నడ, తెలుగులో టాలీవుడ్ డైరెక్టర్ కోడి రామకృష్ణ నాగాభరణం అనే సినిమాలో దివంగత స్టార్ విష్ణువర్ధన్ క్యామియో లో నటింపచేసారు. ఇప్పుడు అదే విధంగా కెప్టెన్ విజయకాంత్ రోల్ కూడా ఉండబోతుంది. ఇక చాలా రోజుల నుండి విజయ్ సినిమాలో కెప్టెన్ నటిస్తున్నారని వార్తలు వస్తుండగా, ఆయన లేకపోయినా, ఇప్పుడు ఆయన క్యామియో కంఫర్మ్ అయినందుకు ఇరు హీరోల ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఇక ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం మూవీ తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో జయరామ్, ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు